మరో మెట్టు ఎక్కిన మాజీ మిస్ దివా యూనివర్స్.. ఇకపై గ్లోబల్‌స్టార్‌‌గా..

ABN , First Publish Date - 2022-04-13T18:28:14+05:30 IST

ఊర్వశి రౌతేలా.. రోజుకో మెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని పెంచుకుంటూ వెళుతోంది. 2012లో మిస్ ఇండియాగా..

మరో మెట్టు ఎక్కిన మాజీ మిస్ దివా యూనివర్స్.. ఇకపై గ్లోబల్‌స్టార్‌‌గా..

ఊర్వశి రౌతేలా.. రోజుకో మెట్టు ఎక్కుతూ తన పాపులారిటీని పెంచుకుంటూ వెళుతోంది. 2012లో మిస్ ఇండియాగా నిలిచిన ఈ బ్యూటీ అనంతరం బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. అలాగే 2015లో ఏకంగా మిస్ దివా యూనివర్స్‌గా ఎంపికైంది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకొని ఈ తార గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ 2021 కాంపిటీషన్‌లో ఓ జడ్జిగా సైతం వ్యవహరించింది. ఈ భామ తాజాగా మరో మెట్టు ఎక్కింది.


‘365 డేస్’ సినిమాతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు మిచెల్ మోరోన్‌‌తో కలిసి ఓ సినిమాలో నటించనుంది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ‘రెనాటా ఫొంటే’. ఈ సినిమాకి 365 డేస్ దర్శకుడు బార్బరా బియాలోవాస్ దర్శకత్వం వహించనున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే కొందరూ బాలీవుడ్ నటీమణులు హలీవుడ్ సినిమాల్లో నటించి తమ సత్తా చాటారు. 


ఐశ్వర్యరాయ్, దీపిక పదుకొనే వంటి వారు కొన్ని సినిమాల్లో నటించగా.. ప్రియాంక చోప్రా మాత్రం వరుసగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కమిట్ అవుతూ అక్కడే పాగా వేసి గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది. ఈ తరుణంలో ఊర్వశి కూడా ఎంట్రీ ఇవ్వడం ఈ భామ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. దీంతో ఈ తార పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు మీరు గ్లోబల్ స్టార్, అంతర్జాతీయ మోడల్ నటి అంటూ ఈ భామపై ప్రశంసలు కురిపిస్తున్నారు.



Updated Date - 2022-04-13T18:28:14+05:30 IST