Urvashi మెడపై ‘ప్రేమ గాటు’... పిచ్చి మాటలు ఆపండంటూ బ్యూటీ క్వీన్ ఆగ్రహం...

ABN , First Publish Date - 2022-02-22T22:39:51+05:30 IST

బాలీవుడ్ బ్యూటీస్‌కి మీడియా ఎంత హైప్ ఇస్తుందో... అంతే హైపర్ టెన్షన్ కూడా క్రియేట్ చేస్తుంటుంది. అదే జరిగింది ఊర్వశీ రౌతేలా విషయంలో. సొషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే బ్యూటీ క్వీన్ అంటే మీడియాకు కూడా బోలెడు క్రేజ్. అయితే తాజాగా ఓ వెబ్ పోర్టల్ కొంచెం హద్దలు మీరింది. ముద్దుల ముచ్చట్లు చెబుతూ ఊర్వశీ మెడపైన...

Urvashi మెడపై ‘ప్రేమ గాటు’... పిచ్చి మాటలు ఆపండంటూ బ్యూటీ క్వీన్ ఆగ్రహం...

బాలీవుడ్ బ్యూటీస్‌కి మీడియా ఎంత హైప్ ఇస్తుందో... అంతే హైపర్ టెన్షన్ కూడా క్రియేట్ చేస్తుంటుంది. అదే జరిగింది ఊర్వశీ రౌతేలా విషయంలో. సొషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే బ్యూటీ క్వీన్ అంటే మీడియాకు కూడా బోలెడు క్రేజ్. అయితే తాజాగా ఓ వెబ్ పోర్టల్ కొంచెం హద్దలు మీరింది. ముద్దుల ముచ్చట్లు చెబుతూ ఊర్వశీ మెడపైన ‘ప్రేమ గాటు’ అంటూ కథనం రాసేసింది. అయితే, సదరు వార్త తప్పు అంటోంది ఊర్వశీ. తన మెడపై కనిపించింది ‘లవ్ బైట్’ కాదంటూ ట్విట్టర్‌లో స్పందించింది. 


హిందీ మీడియాలో అచ్చైన ఓ కథనంలో తన మెడ మీద పంటి గాటు కనిపించిందంటూ రాయటం... అది లవ్ బైట్ అంటూ పేర్కొనటం... ఊర్వశీని హర్టయ్యేలా చేసింది. దాంతో ఆ ఆర్టికల్ తాలూకూ హెడ్‌లైన్‌ స్నాప్‌షాట్‌ని ఆమె ట్విట్టర్‌లో పెట్టింది. తన అభిప్రాయాన్ని కూడా సూటిగా వెల్లడించింది. ‘‘ఇది హాస్యాస్పదం! అది నా రెడ్ లిప్‌స్టిక్ మరక. మాస్క్ కారణంగా పెదాల నుంచీ మెడ మీదకు వ్యాపించింది. అయినా, రెడ్ లిప్‌స్టిక్‌ పెదాలకి ధరించిన తరువాత దాన్ని మెయింటైన్ చేయటం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెబుతుంది. అసలు నేను సాధించిన విజయాల గురించి మీరు రాయవచ్చు కదా... ఎందుకు అబద్ధపు వార్తల్ని ప్రచారం చేస్తారు?’’ అనే అర్థం వచ్చేలా ఊర్వశీ ఇంగ్లీష్‌లో కామెంట్ చేసింది. 


అందాల పోటీల్లో సత్తా చాటి బాగా పాప్యులర్ అయిన ఊర్వశీ రౌతేలా నటిగా భారీ విజయాలు అందుకోలేదు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వీడియో సాంగ్స్ చేస్తున్నప్పటికీ ఫ్యాషనీస్టాగా మాత్రం ఆమెకు తిరుగులేదనే చెప్పాలి. జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆమె పలుమార్లు ర్యాంప్‌పై, ఇతర వేదికలపై మెరిసిపోతుంటుంది. 2021 మిస్ యూనివర్స్ ఫైనల్స్‌కి కూడా ఊర్వశీ ఒక జడ్జ్‌గా వ్యవహరించింది... 

Updated Date - 2022-02-22T22:39:51+05:30 IST