Urfi Javed డ్రెస్సింగ్‌పై నెటిజన్ల దారుణ ట్రోలింగ్!

ABN , First Publish Date - 2021-11-08T21:18:23+05:30 IST

బిగ్‌బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్, నటి ఉర్ఫీ జావేద్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Urfi Javed డ్రెస్సింగ్‌పై నెటిజన్ల దారుణ ట్రోలింగ్!

బిగ్‌బాస్ ఓటీటీ మాజీ కంటెస్టెంట్, నటి ఉర్ఫీ జావేద్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమె డ్రెస్సింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఉర్ఫీ జావేద్‌కు ఇలాంటి ట్రోలింగ్ కొత్త కాదు. వినూత్న రీతిలో దుస్తులు ధరించడం, నెటిజన్ల కోపానికి గురి కావడం ఉర్ఫీకి అలవాటే. తాజాగా బ్యాక్‌లెస్ టాప్ ధరించి తీసుకున్న వీడియోను ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. వెంటనే ఈ వీడియోపై ట్రోలింగ్‌ మొదలైంది. 


ఇలా ఎన్ని వేషాలు వేసినా బాలీవుడ్ అవకాశాలు రావని నెటిజన్లు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. పూర్తి న్యూడ్ వీడియో షేర్ చేసినా ఏం ఉపయోగం ఉండదని విమర్శలు చేస్తున్నారు. గతంలో ఓ వెబ్‌సైట్ రాసిన ఆర్టికల్‌కు ఉర్ఫీ కౌంటర్ ఇచ్చింది. పొట్టి దుస్తులు ధరించి జాన్వీ కపూర్ దిగిన ఫొటోకు ఓ వెబ్‌సైట్ `ఐల్యాండ్ గర్ల్` అని హెడ్డింగ్ పెట్టింది. దాని స్క్రీన్ షాట్ షేర్ చేసిన ఉర్ఫీ.. `మీరు స్టార్ కిడ్ అయితే హెడ్డింగ్ ఇలా ఉంటుంది` అని పేర్కొంది. అలాగే తన దుస్తులు చాలా చిన్నవిగా ఉన్నాయని ఓ వెబ్‌సైట్ రాసిన ఆర్టికల్ స్క్రీన్ షాట్ షేర్ చేసి.. `మీరు స్టార్ కిడ్ కాకపోతే హెడ్డింగ్ ఇలా ఉంటుంద`ని పేర్కొంది.  



Updated Date - 2021-11-08T21:18:23+05:30 IST