చాలామందిలాగే నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. మంచి పేరున్నవాళ్లే.. : బోల్డ్ బ్యూటీ

ABN , First Publish Date - 2021-12-24T21:38:45+05:30 IST

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ ఓటీటీతో గుర్తింపు పొందిన ఈ భామ..

చాలామందిలాగే నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. మంచి పేరున్నవాళ్లే.. : బోల్డ్ బ్యూటీ

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ ఓటీటీతో గుర్తింపు పొందిన ఈ భామ దాదాపు ప్రతి రోజు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. నిజానికి ఎక్కువగా తన బోల్డ్ డ్రెసింగ్ విషయంలో ట్రోలింగ్‌కి గురవుతూ ఈ బ్యూటీ. అంతేకాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటీమణులు కెండల్ జెన్నర్, ప్రియాంక చోప్రా వంటి ఎంతో మంది స్టైల్‌ని అనుకరిస్తూ విమర్శల పాలవుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది ఉర్ఫీ.


ఓ ఇంటర్వ్యూలో ఉర్ఫీ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిల్లాగే నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒకసారి నన్ను దీని గురించి ఫోర్స్ చేశాడు కానీ అదృష్టం కొద్ది బయట పడగలిగా. పరిశ్రమలో పెద్ద మనుషులుగా మంచి పేరున్న వ్యక్తులే నన్ను క్యాస్టింగ్ కౌచ్ చేయడానికి ప్రయత్నించారు. వారు చాలా పవర్‌ఫుల్ వ్యక్తులు. వాళ్లు తలచుకుంటే ఎప్పుడైనా, ఎవరినైనా ఇండస్ట్రీ నుంచి బయటికి నెట్టేయగలరు. అందుకే వారి పేర్లు బయటికి చెప్పలేన‌’ని తన అనుభవాలను చెప్పుకొచ్చింది ఈ భామ.


తనకున్న నెగటివ్ ఇమేజ్ వల్ల తాను చాలా షో నుంచి రిజెక్ట్ అయినట్లు చెప్పింది ఉర్ఫీ. అంతేకాకుండా.. ‘మొదట నేను ముంబైకి వచ్చినప్పుడు చాలా బిజీ అయిపోతానని భావించా. కానీ అలా జరగలేదు. దాంతో డబ్బుల కోసం టీవీలోనూ, సినిమాల్లోనూ చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది. అంతేకాదు నాకు ఉన్న నెగటివ్ ఫాలోయింగ్ వల్ల ఇప్పటికి చాలా రిజెక్షన్స్ ఎదుర్కొంటుంటాన’ని తెలిపింది ఈ బ్యూటీ. ట్రోలింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోనని ఉర్ఫీ పేర్కొంది.

Updated Date - 2021-12-24T21:38:45+05:30 IST