వాళ్లు నాతో అసభ్యంగా ప్రవర్తించారు.. అందుకే గొడవపడ్డా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

ABN , First Publish Date - 2022-03-29T18:08:35+05:30 IST

హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ..

వాళ్లు నాతో అసభ్యంగా ప్రవర్తించారు.. అందుకే గొడవపడ్డా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో పాపులారిటీ సాధించిన నటి ఉర్ఫీ జావేద్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ విచిత్ర వేషధారణతో ట్రోలింగ్ గురవుతూ ఉంటుంది. అయితే ఈ భామ ఓ సెక్యూరిటీ గార్డులతో గొడవ పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానికి సంబంధించి ఏం జరిగిందో చెబుతూ సోషల్ మీడియాలో స్టోరీ పెట్టింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఉర్ఫీ పెట్టిన స్టోరీలో.. ‘మీకు అసలు ఏం జరిగిందో చెప్పాలి. నేను ఇంటర్వ్యూ కోసం ఓ చోటుకి వెళ్లాను. అక్కడ గార్డ్స్ నాతో, అలాగే అక్కడి వచ్చిన మీడియా వారితో తప్పుగా ప్రవర్తించారు (శారీరకంగా కూడా). ఇది కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల జరిగిందని, అనంతరం క్షమాపణలు చెప్పారు. కానీ దానికి కారణం అది కాదు. నేను స్టార్ కిడ్‌ని కాదు, ఇక్కడ నాకు గాడ్ ఫాదర్ లేడు. అలాగే నాకు 24 గంటలు బౌన్సర్లు ఉండరు. అందుకే చాలామంది నన్ను చులకనగా భావిస్తారు. కానీ మీకో విషయం చెబుతున్నాను. నేను చాలా కింద నుంచి స్వయంకృషితో వచ్చాను. దానికి నేను గర్వపడుతున్నాను. నిజానికి నేను మంచి ఫ్యాన్సీ కారులో, బాడీగార్డులతో వేదికలోకి ప్రవేశించి ఉంటే, ఇలా జరిగేది కాదు. అంటే నేను అవన్నీ భరించలేనని కాను. కానీ నాకు రిక్షాలలో, ఉబర్స్‌లో ప్రయాణించడం నాకు ఇష్టం. అంతేకానీ షో ఆఫ్ చేయడం నాకు ఇష్టం లేదు. రిపోర్టర్లు, నాలాంటి వారితో కలిపి ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. నన్ను ఆహ్వానించడం వల్ల అక్కడికి వెళ్లాను తప్ప నేను కావాలని వెళ్లలేదు. కాబట్టి అలా ప్రవర్తించడం కరెక్టు కాదు. అందరికీ ధన్యవాదాలు. మన చుట్టూ ఉన్న వ్యక్తులపై మనందరం కొంచెం దయ చూపుదాం’ అని రాసుకొచ్చింది.




అలాగే మరో స్టోరీలో.. ‘మీడియాగానీ, నేనుగానీ ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లాం. కాబట్టి గార్డులు మమ్మల్ని అగౌరవపరిచే ముందు వారి ఉన్నతాధికారులను అడిగి ఉండాల్సింది. అలాగే వారు కొంచెం మర్యాదగా ఉండాల్సిందని నేను భావిస్తున్నాను. చుట్టూ బౌన్సర్ల‌తో ఫ్యాన్సీ కారులో అక్కడికి వెళితే ఇలా చేసేవారు కాదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. చివరికి ఏమైంది?.. కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని వారు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. విచారకరమైన నిజం ఏంటంటే.. డబ్బు ఉన్నట్లు చూపించుకుంటేనే ఎవరైనా మీకు గౌరవమిస్తారు. ఇది తెలిసినప్పటికీ నా ఆలోచనలో ఎలాంటి మార్పు రాదు’ అంటూ ఉర్పీ ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

Updated Date - 2022-03-29T18:08:35+05:30 IST