15 ఏళ్ల వయస్సులో దారుణమైన అనుభవం... Urfi Javed చేదు గతం...

ABN , First Publish Date - 2022-04-29T23:16:41+05:30 IST

ఉర్ఫీ జావేద్ మరోసారి పెద్ద బాంబు పేల్చింది. 15 ఏళ్ల వయస్సులో తాను ఎదుర్కొన్న ఓ దారుణమైన అనుభవం గురించి తెలియజేసింది. అప్పట్లో తాను లక్నో నగరంలో ఉండేదాన్ననీ... ఒక ‘ఆఫ్ షోల్డర్’ టాప్ ధరించాననీ చెప్పింది. అయితే...

15 ఏళ్ల వయస్సులో దారుణమైన అనుభవం... Urfi Javed చేదు గతం...

ఉర్ఫీ జావేద్ మరోసారి పెద్ద బాంబు పేల్చింది. 15 ఏళ్ల వయస్సులో తాను ఎదుర్కొన్న ఓ దారుణమైన అనుభవం గురించి తెలియజేసింది. అప్పట్లో తాను లక్నో నగరంలో ఉండేదాన్ననీ... ఒక ‘ఆఫ్ షోల్డర్’ టాప్ ధరించాననీ చెప్పింది. అయితే, ఉర్ఫీ ఆ హాట్ ఫోటోని ఫేస్బుుక్‌లో కూడా పోస్ట్ చేసిందట. అది కాస్తా ఎవరో తీసుకెళ్లి పోర్న్ సైట్‌లో పెట్టేశారట. తన ఫోటో ఏకంగా బూతు సైట్‌లో కనిపించటంతో ఊరు ఊరంతా రచ్చగా మారిపోయిందట. ఉర్ఫీ కుటుంబ సభ్యులతో సహా అందరూ ఆమెనే తప్పుబట్టారట. అంతా నీ స్వయంకృతాపరాధం అంటూ విమర్శించారట. 


15 ఏళ్ల వయస్సులోనే సొషల్ మీడియాలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఉర్ఫీ ఇప్పటికీ తన తీరు మాత్రం మార్చుకోలేదు. ‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ కాస్ట్యూమ్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ని భగ్గుమనిపిస్తుంటుంది. అదే రేంజ్లో నెటిజన్స్ ఆమెని ట్రోల్ చేస్తుంటారు కూడా. అయినా తనకు లభించే నెగటివ్ పబ్లిసిటీని, కాంట్రవర్సీలను ఉర్ఫీ తనకు ప్లస్ అయ్యేలా చూసుకుంటూ ఉంటుంది. ఏదో ఒక గొడవతో ఆమె నిత్యం వార్తల్లో మాత్రం కొనసాగుతూ ఉంటుంది! 

Updated Date - 2022-04-29T23:16:41+05:30 IST