రామ్‌చరణ్ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) కరోనా బారిన పడ్డారు. చెన్నైలో ఉంటోన్న తాతయ్య కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లాలనుకున్న ఆమె కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేసిన ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు చెప్పారు.
‘‘గత వారం నాకు కరోనా సోకింది. వాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు కనిపించాయి. వైద్యులు పారాసిటిమాల్, విటమిన్ టాబ్లెట్లు మాత్రమే సూచించారు. కరోనా (Corona) వల్ల ఎనర్జీ కోల్పోతామనీ, జుట్టు పలచన అవుతుందనీ, రకరకాల నొప్పులు ఉంటాయనీ చాలామంది చెప్పగా భయపడ్డాను. కానీ నాకు అవేమీ లేదు. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నా. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా ఉన్నా. కరోనా మళ్లీ విజృంభిస్తుందా అంటే ఏమీ చెప్పలేం. మన జాగ్రత్తల్లో ఉండటం చాలా అవసరం. తాతయ్య ఇంటికి వెళ్తూ టెస్ట్ చేయించుకున్నాను కాబట్టి నాకు తెలిసింది.. లేకపోతే తెలిసేదికాదు. విశ్రాంతి తీసుకుంటూనే మళ్లీ లైఫ్‌ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యా’’ అని ఉపాసన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.