Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ అంత బాధలో ఉంటే.. వాళ్లింటికి వెళ్లి ఇతను ఏం చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2022-09-29T17:37:40+05:30 IST

మరి ఇదే సమయం అనుకున్నాడో.. ఏమో.. ఓ అగంతకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిలో చోరీకి విఫలయత్నం చేశాడు. మహేష్ బాబు జూబ్లీహిల్స్..

Mahesh Babu: మహేష్ ఫ్యామిలీ అంత బాధలో ఉంటే.. వాళ్లింటికి వెళ్లి ఇతను ఏం చేశాడో చూడండి..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఇంట బుధవారం తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ కృష్ణ (Krishna) సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి (Indira Devi).. అనారోగ్యంతో బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఆమె.. మంగళవారం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తుంది. ఆ సమయంలో ఫ్యామిలీ సిబ్బంది అంతా హాస్పిటల్‌ దగ్గరే ఉన్నట్లుగా సమాచారం. మరి ఇదే సమయం అనుకున్నాడో.. ఏమో.. ఓ ఆగంతకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిలో చోరీకి విఫలయత్నం చేశాడు. మహేష్ బాబు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81లో నివాసముంటున్నారు. ఆయన ఇంటి చుట్టూ కరెంట్ ఫెన్సింగ్‌తో కూడిన ఎత్తయిన ప్రహరీ (30 అడుగులు) ఉంటుంది. దానిని దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ దొంగ.. పట్టుతప్పి కింద పడిపోయాడు. ఫలితంగా తీవ్రగాయాలు అవడమే కాకుండా.. లేచి పారిపోలేని పరిస్థితి.


మంగళవారం రాత్రి సుమారు 11 గంటల తర్వాత ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. దొంగ (Thief) పడిపోయినప్పుడు బిగ్గరగా శబ్ధం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అవడం.. వెంటనే  అతడిని పట్టుకుని.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ దొంగని విచారించి హాస్పిటల్‌కి తరలించినట్లుగా తెలుస్తుంది. ఆ విచారణలో అతను మూడు రోజుల కిందట ఒడిశా నుండి హైదరాబాద్ వచ్చినట్లుగానూ, తన పేరు కృష్ణ అని చెప్పినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆ దొంగకి తీవ్ర గాయాలు కావడంతో.. పోలీసులు అతనిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగానూ, పూర్తిగా కోలుకున్న తర్వాత అతని నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తునట్లుగా తాజా సమాచారం. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మహేష్ బాబు ఇంటిలో లేరని తెలుస్తోంది. ఈ సంఘటన పూర్తి వివరాలను త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు.


ఇదిలా బుధవారం తెల్లవారు జామున కన్నుమూసిన ఇందిరా దేవి అంత్యక్రియలను మహేష్ బాబు దగ్గరుండి జరిపించారు. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్ధం పద్మాలయా స్టూడియోలో బుధవారం మధ్యాహ్నం వరకూ ఇందిరా దేవి పార్దివ దేహాన్ని ఉంచారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆవిడ అంత్యక్రియలు జరిగాయి. 

Updated Date - 2022-09-29T17:37:40+05:30 IST