Krishnam Raju: జయలలిత కొన్నారంటూ కృష్ణంరాజుకు కూడా అమ్మేవాళ్లట.. నటనలో మెళకువల కోసం ఆయన్ను కలిసి..

ABN , First Publish Date - 2022-09-12T22:30:15+05:30 IST

పుస్తకాలు చదవడం అనే అలవాటు కొద్ది మందికే ఉంటుంది. వారిలో కాలక్షేపం కోసం చదివేవాళ్లే ఎక్కువ. మిగతా సీరియస్ పాఠకుల్లో కూడా పుస్తకాల్ని పాఠాలుగా, గుణపాఠాలుగా గుర్తించేవాళ్లు అతితక్కువ.

Krishnam Raju: జయలలిత కొన్నారంటూ కృష్ణంరాజుకు కూడా అమ్మేవాళ్లట.. నటనలో మెళకువల కోసం ఆయన్ను కలిసి..

పుస్తకాలు చదవడం అనే అలవాటు కొద్ది మందికే ఉంటుంది. వారిలో కాలక్షేపం కోసం చదివేవాళ్లే ఎక్కువ. మిగతా సీరియస్ పాఠకుల్లో కూడా పుస్తకాల్ని పాఠాలుగా, గుణపాఠాలుగా గుర్తించేవాళ్లు అతితక్కువ. ఆ అరుదైన చదువర్లలో కృష్ణంరాజు ( krishnam raju )ఒకరు. బైట ప్రపంచం ఇచ్చే లౌకికజ్ఞానాన్ని పుస్తక ప్రపంచం అందించే అనుభవంతో సరిపోల్చుకునేవారాయన. 


బంధువుల ప్రోత్సాహంతో సినిమా వేషాల కోసం  ఉత్సాహంగా మద్రాసులో అడుగుపెట్టారు కృష్ణంరాజు ( rebel star krishnam raju ). ఆ ప్రయత్నాలతో పాటు, నటన గురించి తెలుసుకునే, నేర్చుకునే ప్రయత్నాలు చేశారు. ఏ శిక్షణా సంస్థకీ వెళ్లలేదు గానీ, నిలువెత్తు నటనాలయంగా గుర్తించిన ఒక పాతతరాల హీరోని కలిసి  నటనలో మెళకువలు తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్రత్యక్షంగా.


ఆ నటుడు మరెవరో కాదు, స్వర్గీయ ఎన్టీరామారావు (NTR) గురు సమానులుగా భావించి, గౌరవించిన సీహెచ్ నారాయణరావు (చదలవాడ నారాయణరావు). 1940- 50 ప్రాంతాల్లో వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన తొలితరం కథానాయకుడు నారాయణరావు గొప్ప నటుడు, బహుభాషావేత్త, అభినయంలో అత్యున్నత ప్రమాణాలు తెలిసినవారని కృష్ణంరాజు గ్రహించారు. వయసు మళ్లి వేషాలు లేక నారాయణరావు తీరుబడిగానే ఉన్నారు కాబట్టి, తనకి నటనలో శిక్షణ ఇవ్వవల్సిందిగా కోరారు కృష్ణంరాజు ( krishnam raju movies ). ఆయన సంతోషంతో ఒప్పుకోవడంతో మైలాపూరులోని నారాయణరావు ఇంటికి వెళ్లేవారు. 


ఇది వ్యావహారికంగా వచ్చే అనుభవం అయితే, ఈ శిక్షణని పుస్తకాల ద్వారా తెలుసుకునే జ్ఞానంతో బేరీజు వేసుకొనేవారట ఆయన. సోవియట్ రష్యా దిగ్దర్శకుడు, నటుడు వి.ఐ. పుదోఫ్కిన్ (Vsevolod Illarionovich Pudovkin) తన సుదీర్ఘ సినీప్రయాణంలోని అనుభవాలు, జ్ఞాపకాలు క్రోడీకరించి రచించిన 'Film Technique and Film Acting' అనే గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివానని ఒక ఇంటర్వ్యూలో అన్నారు రెబల్ స్టార్. మరో రష్యన్ సినీ దిగ్గజం కె ఎస్ స్టానిస్లవ్క్సి (Konstantin Sergeyevich Stanislavski) రాసిన ఆత్మకథనాత్మక రచన 'My Life in Art', ఇంకా విద్యార్థి డైరీ రూపంలో రాసిన యాక్టర్స్ మాన్యూల్ - 'An Actor's Work' వంటి పుస్తకాల్ని శ్రద్ధగా చదివేవాడ్నని చెప్పుకొచ్చారాయన. 


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత (Jayalalita), కృష్ణంరాజు ( krishnam raju ) పుస్తకాలు చదవడంలో పోటీపడేవారట. అమెరికన్ పుస్తకాల్ని కృష్ణంరాజు కొన్నాడని జయలలితకి, ఆమె కొనిందని తనకీ అమ్మేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కృష్ణంరాజు. నటుడిగా, ఆ తర్వాత నిర్మాతగా కూడా బిజీ అయిపోయాక కూడా ఆయన పుస్తకాలు చదువుతుండేవారు.అలా పుస్తకపఠనం ఆయనకి పాఠాలు, గుణపాఠాలు కూడా నేర్పాయి.

Updated Date - 2022-09-12T22:30:15+05:30 IST