Happy Birthday Sonu Sood: సోనూసూద్‌ గురించి చాలా మందికి తెలియని నిజాలివి.. ఎన్నేళ్ల వయసులో పెళ్లయిందంటే..!

ABN , First Publish Date - 2022-07-30T19:51:28+05:30 IST

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు సోనూసూద్. గడ్డు పరిస్థితుల్లో ఎంతోమంది నిరుపేదలకి..

Happy Birthday Sonu Sood: సోనూసూద్‌ గురించి చాలా మందికి తెలియని నిజాలివి.. ఎన్నేళ్ల వయసులో పెళ్లయిందంటే..!

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా వినిపించిన పేరు సోనూసూద్ (Sonu Sood). గడ్డు పరిస్థితుల్లో ఎంతోమంది నిరుపేదలకి, అవసరం ఉన్నవారికి సహాయం చేస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అంతకుముందు ఈయన మంచి నటుడు. దక్షిణాదిలో చేసిన సినిమాల ద్వారా సినీ పరిశ్రమకి పరిచయమైన ఈ నటుడు.. అనంతరం బాలీవుడ్‌ (Bollywood)కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం మంచి గుర్తింపు సాధించాడు. ఈ రోజు మంచి మనసున్న మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ పుట్టిన రోజు. ఈ సందర్భంలో సోనూ గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన పలు ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం..


కుటుంబం.. విద్య..

పంజాబ్‌లోని మోగాలో జన్మించిన సోనూ సూద్ తండ్రి శక్తి సాగర్ సూద్ (Shakthi Sagar Sood) ఒక క్లాత్ షోరూమ్‌‌కి యజమాని. ఆయన తల్లి సరోజ్ సూద్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఆయన అక్క మోనికా శాస్త్రవేత్త. కాగా.. ఈ నటుడు నాగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1996లో కేవలం 23 ఏళ్ల వయసులో సోనాలి సూద్‌ని సోనూ సూద్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. సోనూ నటుడిగా మారి పాపులర్ ఫిగర్‌గా కాకముందే.. ఈ జంటకి ఇషాన్, అయాన్ అనే ఇద్దరు కొడుకులు పుట్టారు.


నటుడిగా.. నిర్మాతగా..

సౌత్ సినిమాలతో సోనూ సూద్ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.  అనంతరం దేశభక్తి ఆధారంగా తెరకెక్కిన షహీద్-ఇ-ఆజామ్‌లో భగత్ సింగ్ పాత్రతో 2002 బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. 


సోనూ సూద్ తన తండ్రి పేరు మీద ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాడు. ఆ కంపెనీ పేరు శక్తి సాగర్ ప్రొడక్షన్స్‌. ఆ బ్యానర్‌లో ‘ఫతే (Fateh)’ అనే యాక్షన్ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నాడు. అందులో ఆయనే హీరో. ఆ మూవీ పోస్టర్లు ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి.


యాప్ క్రియేటర్‌గా.. రచయితగా..

ప్రయాణ ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుని జూన్ 2022లో ఎక్స్‌ప్లర్గర్ అనే తన సొంత సోషల్ మీడియా యాప్‌ను సోనూ సూద్ ప్రారంభించాడు. ఆయన యాప్ నినాదం ‘యహన్ నహీ తో సోషల్ నహీ’. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఆయన భార్య సోనాలి కూడా ఒకరు.


డిసెంబర్ 2020లో.. కోవిడ్ 19 ప్రేరేపిత జాతీయ లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వేలాది మంది జనాలను సోనూ సూద్ వాళ్ల ఇళ్లకు చేరుకోవడానికి సహాయం చేశాడు. ఈ సందర్భంలో ఆయనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ మీనా అయ్యర్‌తో కలిసి సోనూ ‘ఐ యామ్ నో మెస్సయ్య’ అనే పుస్తకాన్ని రాశాడు.

Updated Date - 2022-07-30T19:51:28+05:30 IST