విక్రమ్ హిట్‌తో ఫుల్ జోష్‌లో కమల్ హసన్.. Rajinikanth తో తీయబోయే సినిమాపై కీలక ప్రకటన..!

ABN , First Publish Date - 2022-06-10T01:29:27+05:30 IST

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). పాన్ ఇండియాగా రూపొందింది. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు.

విక్రమ్ హిట్‌తో ఫుల్ జోష్‌లో కమల్ హసన్.. Rajinikanth తో తీయబోయే సినిమాపై కీలక ప్రకటన..!

విశ్వ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) తాజాగా నటించిన సినిమా ‘విక్రమ్’ (Vikram). పాన్ ఇండియాగా రూపొందింది. లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న పలు భాషల్లో విడుదల అయింది. ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దుసుకుపోతుంది. భారీ వసూళ్లను రాబడుతుంది. వరల్డ్ వైడ్‌గా రూ. 200కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. కేరళలో ఆల్ టైం నం-1 తమిళ్ మూవీగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో మీడియా సమక్షంలో ‘విక్రమ్’ సక్సెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో కమల్ హాసన్‌తో పాటు లోకేశ్ కనకరాజ్ కూడా పాల్గొన్నారు. ‘విక్రమ్’ ను అభిమానులకు చేరువ చేసినందుకు మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు.  


గత కొన్నేళ్లుగా రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్‌తో ఓ సినిమా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రజినీ హీరోగా కమల్ నిర్మాతగా వ్యవహరిస్తారని గుసగుసలు కూడా వినిపించాయి. ఈ చిత్రానికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించాలి. కానీ, కరోనా విలయతాండవం చేయడంతో ఈ మూవీ పట్టాలెక్కలేదు. ‘విక్రమ్’ సక్సెస్ మీట్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి ఓ విలేకరి ప్రశ్నించారు. అందుకు కమల్ ఆసక్తికర సమధానం ఇచ్చారు. ‘‘ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గురించి రజినీ, లోకేశ్ చర్చించుకోవాలి. ఒకవేళ ఈ సినిమా ఒకే అయితే అధికారికంగా ప్రకటిస్తాం. రజినీకాంత్‌తో మూవీ చేయడానికి నేను ఎల్లప్పుడు సిద్దమే’’ అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘విక్రమ్’ విడుదలకు కొన్ని రోజుల ముందు నిర్మాత మహేంద్రన్‌, కమల్ హాసన్, లోకేశ్ కనకరాజ్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్‌ని కలసిన సంగతి తెలిసిందే. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా కూడా మారాయి. ఆ సమయంలోనే ఈ క్రేజీ కాంబో గురించి చర్చించుకున్నారని సమాచారం. అయితే, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో మాత్రం చెప్పలేం. అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.  ‘విక్రమ్’లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రలు పోషించారు. సూర్య అతిథి పాత్రలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌లో రెండు మిలియన్ డాలర్స్‌ కలెక్షన్స్‌ను కొల్లగొట్టడం విశేషం. 

Updated Date - 2022-06-10T01:29:27+05:30 IST