సౌత్ హీరోకి ఇంగ్లీష్ నేర్పుతున్న ఉక్రెయిన్ బ్యూటీ
ABN , First Publish Date - 2022-03-11T03:02:50+05:30 IST
తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోన్న చిత్రంలో మరియా అనే నటి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హీరోకు ఇంగ్లీష్‌ను నేర్పించే టీచరుగా ఉంటూ, ఆమె హీరోపై మనసు పారేసుకుంటుందట. ఈ లవ్‌స్టోరీని పూర్తిగా..
కోలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు పొందిన శివ కార్తికేయన్‌కు గత యేడాది బాగా కలిసివచ్చిందని చెప్పొచ్చు. ఆయన నటించిన ‘డాక్టర్’ చిత్రం ఘన విజయం సాధించి శివ కార్తికేయన్ కెరీర్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం తర్వాత.. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న చిత్రాలన్నీ మంచి సక్సెస్ఫుల్ దర్శకులవే కావడం గమనార్హం.
తాజాగా ఆయన టాలీవుడ్లోకి కూడా అడుగుపెడుతున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోన్న చిత్రంలో మరియా అనే నటి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హీరోకు ఇంగ్లీష్‌ను నేర్పించే టీచరుగా ఉంటూ, ఆమె హీరోపై మనసు పారేసుకుంటుందట. ఈ లవ్‌స్టోరీని పూర్తిగా సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజ్ బాణీలో తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది. కాగా, ఇందులో టీచరు పాత్రలో ఉక్రెయిన్ బ్యూటీ మరియా రియాబోషాప్క నటిస్తున్నారు. ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.