Udhayanidhi Stalin: తమిళ హీరో సంచలన నిర్ణయం..సినిమాలకు గుడ్‌బై..!

ABN , First Publish Date - 2022-05-15T16:08:45+05:30 IST

తమిళ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారు. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు.

Udhayanidhi Stalin: తమిళ హీరో సంచలన నిర్ణయం..సినిమాలకు గుడ్‌బై..!

తమిళ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారు. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. 'ఓకే ఓకే' (OK OK ) అనే డబ్బింగ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు స్టాలిన్. ఆయన నటించిన సినిమాలు డీసెంట్ హిట్స్‌గా కూడా నిలుస్తున్నాయి.


త్వరలో ఆయన హీరోగా నటించిన 'నెంజుకు నీధి'( Nenjuku Needhi) అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మే 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన 'ఆర్టికల్ 15' (Article 15) మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు. ఇప్పుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో 'మామన్నన్' (Mamannan) సినిమాను చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ (Keerthi Suresh) హీరోయిన్‌గా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad Fasil) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఇదే తన చివరి సినిమా అంటూ ఉదయనిధి స్టాలిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి తమిళ ప్రేక్షకులకు షాకిచ్చారు.


తాను ఇలా సినిమాలకు గుడ్‌బై చెప్పడానికి కారణం రాజకీయాలే..ఇటు సినిమాలు అటు రాజకీయాలు అంటే రెండు బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. అందుకే, సినిమాలకు గుడ్‌బై చెప్పాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ తనయుడే ఉదయనిధి స్టాలిన్. గత ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే స్టాలిన్ సినిమాలు మానేస్తారని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పి షాకివ్వడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇలా పాలిటిక్స్ కోసం సినిమాలను పక్కన పెట్టిన చాలామంది హీరోలు మళ్ళీ రెండేళ్ళు, మూడేళ్ళ తర్వాత అభిమానుల కోసం మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరి స్టాలిన్ కూడా అలాగే రీ ఎంట్రీ ఇస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Updated Date - 2022-05-15T16:08:45+05:30 IST