5 నిమిషాల్లో నేను, రామ్ మంచి స్నేహితులమయ్యాం: ఉదయనిధి స్టాలిన్

ABN , First Publish Date - 2022-04-24T00:16:55+05:30 IST

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో

5 నిమిషాల్లో నేను, రామ్ మంచి స్నేహితులమయ్యాం: ఉదయనిధి స్టాలిన్

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ది వారియర్’. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి పాటను తమిళ స్టార్ హీరో శింబు పాడిన విషయం తెలిసిందే. ఈ పాటను శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే, యంగ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను ఇంత ఘనంగా ఆవిష్కరించడం ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. సాంగ్ చాలా బాగుంది. రామ్‌తో నాకు ఇంతకు ముందు పరిచయం లేదు. ఇప్పుడే పరిచయమైంది. ఐదునిమిషాల్లో మంచి ఫ్రెండ్ అయిపోయారు. లింగుస్వామి ఫోన్ చేసి ఈ ఫంక్షన్‌కి రావాలని చెప్పినప్పుడు.. అసెంబ్లీ ఉందని చెప్పా. అప్పుడు 21 నుంచి 22కు ఫంక్షన్ డేట్ మార్చారు. ఆయన, రామ్ కలిసి చేసిన ‘ది వారియర్’ సినిమా రామ్ నటించిన విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలవాలి. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. రామ్ తెలుగులో నటించిన ‘రెడ్’ సినిమా తమిళ్ వెర్షన్ ‘తడమ్’ నేను చేయాలి. కానీ, కుదరలేదు. ఇప్పుడు ‘తడమ్’ దర్శకుడు తిరుమేనితో సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు. 


హీరో రామ్ మాట్లాడుతూ.. ‘‘తప్పు చేస్తే వెంటనే అందరికీ తెలుస్తుంది. అదే మంచి చేస్తే అంతగా ప్రచారం జరగదు. అయితే.. కరోనా సమయంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన సేవల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకూ తెలిసింది. ఈ సాంగ్ విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొనడం సంతోషంగా ఉంది. లింగుస్వామి ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారని చెప్పారు. నేను షాకయ్యా. ఆదితో నటించడం మంచి ఎక్స్‌పీరియ‌న్స్‌. దర్శకుడు లింగుస్వామి ప్రతి సన్నివేశాన్ని ఎంతో కేర్ తీసుకుని చేశారు. కృతి శెట్టితో తొలిసారి నటించా. తను మంచి కోస్టార్. నేను చెన్నైలోనే పెరిగా, ఇక్కడే చదువుకున్నాను. నా మొదటి సినిమా తమిళంలో చేయాల్సింది. ఇప్పుడు తమిళంలో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు లింగుస్వామి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగిస్తూ.. సినిమా విశేషాలను తెలిపారు.



Updated Date - 2022-04-24T00:16:55+05:30 IST