మనసు మార్చుకున్న Udayanidhi stalin

ABN , First Publish Date - 2022-06-06T16:36:00+05:30 IST

‘మామనిదన్‌’ (Maamanithan) తన ఆఖరి చిత్రం అని ఇటీవల హీరో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stallen) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతలోనే ఆయన తన మనసు మార్చుకున్నారు. తన మనసుకు నచ్చిన కథా చిత్రాల్లోనే నటిస్తానని స్పష్టం చేశారు. ఒక వైపు రాజకీయాలు, మరోవైపు, డీఎంకే యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలు, ఇంకోవైపు ఎమ్మెల్యే ఇలా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సి వస్తుందన్నారు.

మనసు మార్చుకున్న Udayanidhi stalin

‘మామనిదన్‌’  (Maamanithan) తన ఆఖరి చిత్రం అని ఇటీవల హీరో ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi stalin) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతలోనే ఆయన  తన మనసు మార్చుకున్నారు. తన మనసుకు నచ్చిన కథా చిత్రాల్లోనే నటిస్తానని స్పష్టం చేశారు. ఒక వైపు రాజకీయాలు, మరోవైపు, డీఎంకే యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలు, ఇంకోవైపు ఎమ్మెల్యే ఇలా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సి వస్తుందన్నారు. అందువల్ల అన్ని చిత్రాల్లో కాకుండా మంచి కథా చిత్రాల్లో నటిస్తానని ఆయన వెల్లడించారు. ఉదయనిధి నటించిన ‘నెంజుక్కు నీతి’ (nenjukku neethi) మంచి సక్సెస్‌ సాధించింది.  సామాజిక న్యాయం ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్‌ సినిమా ‘ఆర్టికల్‌ 15‘ (Article 15) కు రీమేక్‌. ఉదయనిధి , తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran)‌, శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar) నటించగా అరుణ్‌ కామరాజ్‌ (Raju Kamaraj) దర్శకత్వం వహించారు. హీరో ఆరి (Aari) ఓ కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor)‌, జీ స్టూడియో (Zee Studio) సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావడంతో ఇటీవల థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ.. ‘ఓ మంచి చిత్రంలో నటించాననే అనుభూతి మిగిలింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘మామనిదన్‌’ చిత్రం తర్వాత నటించనని చెప్పినమాట వాస్తవమే. నేను ఒక్కసారి మాత్రమే చెప్పాను. కానీ, ప్రతి ఒక్కరూ పదేపదే దానినే ప్రస్తావిస్తున్నారు. ఇపుడు అనేక కథలు వింటున్నాను. వాటిలో బాగా నచ్చితేనే ఖచ్చితంగా నటిస్తాను’ అని వివరణ ఇచ్చారు. నటుడు ఆరి మాట్లాడుతూ.. ‘ఉదయనిధి అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో రాణించాలని కోరుతున్నాను’ అని అన్నారు. నటుడు మయిల్‌స్వామి (Mayil swamy) మాట్లాడుతూ.. ‘అధికారం ఉన్నా లేకపోయినా, ఒక సీఎం తనయుడుననే గర్వం లేకుండా ఉదయనిధి మాత్రం అలాగే ఉన్నారు. అలా ఉండటం కొంతమందికే సాధ్యం అని పేర్కొన్నారు. దర్శకుడు అరుణ్‌ కామరాజ్‌ మాట్లాడుతూ.. ‘ఆర్టికల్‌ 15ను తమిళంలోకి రీమేక్‌ చేయాలని నిర్ణయం తీసుకుని నన్ను సంప్రదించి ఈ సినిమా అనువాదం చేసేందుకు ‘కరెక్ట్‌ పర్సన్‌ నువ్వే’ అని చెప్పిన మాటలు జీవితంలో మరిచిపోలేని ఙ్ఞాపకం’ అని గుర్తు చేసుకున్నారు. ఇందులో ఎడిటర్‌ రూబెన్ (Ruben)‌, హీరోయిన్‌ తాన్య రవిచంద్రన్‌, ఇతర యూనిట్‌ సభ్యులు ప్రసంగించారు.

Updated Date - 2022-06-06T16:36:00+05:30 IST