అక్షయ్ ని వెనక్కి నెట్టిన Sonu Sood... ప్రియాంకను మించిపోయిన Alia Bhatt

ABN , First Publish Date - 2021-12-10T21:46:31+05:30 IST

బాలీవుడ్ హీరోలందర్నీ సోనూ సూద్ మించిపోయాడు. బీ-టౌన్ బ్యూటీస్ అందరిలోనూ ఆలియా భట్‌దే పై చేయి. ఇంతకీ ఎక్కడా అనే కదా మీ డౌట్? బాక్సాఫీస్ వద్ద అయితే కాదు...

అక్షయ్ ని వెనక్కి నెట్టిన Sonu Sood... ప్రియాంకను మించిపోయిన Alia Bhatt

బాలీవుడ్ హీరోలందర్నీ సోనూ సూద్ మించిపోయాడు. బీ-టౌన్ బ్యూటీస్ అందరిలోనూ ఆలియా భట్‌దే పై చేయి. ఇంతకీ ఎక్కడా అనే కదా మీ డౌట్? బాక్సాఫీస్ వద్ద అయితే కాదు. ట్విట్టర్‌లో... 


2021 ముగింపుకొచ్చేస్తుండటంతో ట్విట్టర్ తన మేల్ అండ్ ఫీమేల్ బాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్టుల్ని రిలీజ్ చేసింది. ఈ సంవత్సరంలో అత్యధికంగా ఎవరి గురించి జనం ట్వీట్ చేశారో తెలుసా? సోనూ సూద్! 2020లో కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉధృతంగా తెర మీదకొచ్చిన ఆయన 2021లోనూ అత్యధిక ట్వీట్స్‌లో చోటు సంపాదించాడు. ఆయన తరువాతి స్థానాల్లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమితాబ్ లాంటి టాప్ స్టార్స్ ఉండటం విశేషం...


బాలీవుడ్ బ్యూటీస్ విషయానికి వస్తే... ఆలియా భట్ అందరి కంటే ముందు వరుసలో ఉంది. ఆమె గురించి నెటిజన్స్ అత్యధికంగా ట్వీట్స్ చేశారట. ఆలియా తరువాతి స్ఠానాల్లో ప్రియాంక చోప్రా, దిశా పఠానీ, దీపికా పదుకొణే, అనుష్కా శర్మ చొటు సంపాదించారు. 


ట్విట్టర్ ఇండియా ఇంకా పలు అంశాల వారిగా తన టాప్ లిస్టుల్ని తాజాగా వెలువరించింది.                                 

Updated Date - 2021-12-10T21:46:31+05:30 IST