Oscars 2023: ఆస్కార్స్‌కి వెళ్లేందుకు పోటీ పడుతున్న ఆర్ఆర్ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్.. ఫ్యాన్స్ సపోర్టు దేనికంటే..

ABN , First Publish Date - 2022-09-20T23:21:02+05:30 IST

సినీ అవార్డులలో ‘ఆస్కార్(Oscar)’ అవార్డులకి ఉన్న విలువ గురించి తెలిసిందే. అందుకే జీవితంలో ఒక్కసారైన ఈ ప్రతిష్టాత్మక..

Oscars 2023: ఆస్కార్స్‌కి వెళ్లేందుకు పోటీ పడుతున్న ఆర్ఆర్ఆర్, ది కాశ్మీర్ ఫైల్స్.. ఫ్యాన్స్ సపోర్టు దేనికంటే..

సినీ అవార్డులలో ‘ఆస్కార్(Oscar)’ అవార్డులకి ఉన్న విలువ గురించి తెలిసిందే. అందుకే జీవితంలో ఒక్కసారైన ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందాలని సినీ ఇండస్ట్రీలో పని చేసే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇటీవలే ఆస్కార్ 2022 అవార్డుల కార్యక్రమం పూర్తవగా.. ప్రస్తుతం వచ్చే ఏడాది జరిగే అవార్డుల కార్యక్రమం గురించి చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో పోటీ పడేందుకు భారతదేశం నుంచి పంపే మూవీని సెలక్ట్ చేసే పనిలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యులు తలమునకలై ఉన్నారు. వచ్చే నెలలో ఆస్కార్ ఎంట్రీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆస్కార్‌ 2023కి అధికారికంగా వెళ్లే సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక చర్చ జరుగుతోంది.


అందులో దేశవ్యాప్తంగా చాలా సినిమాలు జ్యూరీ సభ్యుల పర్యవేక్షణలో ఉండగా.. అన్నింటికంటే ఎక్కువగా మద్దతు మాత్రం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్’కి దక్కుతోంది. దీంతో మా సినిమాని పంపాలంటూ.. రెండు చిత్రాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ ఏడాది సంచలన విజయాలను దక్కించుకున్న ఈ సినిమాల్లో ఒకటే ఆస్కార్‌కి వెళ్లే అవకాశం ఉందని అందరూ ప్రెడిక్ట్ చేస్తున్నారు.


కాగా.. ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి అభిమానులు ‘RRRForOscars’.. అలాగే ది కాశ్మీర్ ఫైల్స్ ఫ్యాన్స్ ‘TheKashmirFilesForOscars’ యాష్ ట్యాగ్‌లని ట్రెండ్ చేస్తున్నారు. పశ్చిమ దేశాల్లోని సినీ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. వారికి నచ్చింది కాబట్టి ఈ సినిమాని అధికారికంగా పంపితే కొరియన్ సినిమా ‘పారాసైట్’లాగే చాలా విభాగాల్లో నామినేట్ అయ్యే అవకాశం ఉందని ఆ మూవీ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అలాగే.. నిజ జీవితంలో కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది కాశ్మీరీ ఫైల్స్’ చిత్రానికే ఆస్కార్‌కి వెళ్లే అర్హత ఉందని ఆ మూవీ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. జ్యూరీ సభ్యులు మనదేశం నుంచి ఏ సినిమాని ఆస్కార్ 2023కి పంపుతారో చూడాలి మరి.







Updated Date - 2022-09-20T23:21:02+05:30 IST