నాన్నకు కూడా లీవ్ అవసరమే... అంటోన్న Anushka Sharma

ABN , First Publish Date - 2022-02-18T01:19:48+05:30 IST

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పరాగ్ అగర్వాల్ ‘డాడీ లీవ్’పై ప్రత్యేకంగా రియాక్ట్ అయింది. ‘అబౌట్ టైం దిస్ ఇజ్ నార్మలైజ్డ్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

నాన్నకు కూడా లీవ్ అవసరమే... అంటోన్న Anushka Sharma

సొషల్ మీడియా జెయింట్ ట్విట్టర్‌కి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు పరాగ్ అగర్వాల్. ఆయన తన రెండో బిడ్డ జన్మించనున్న నేపథ్యంలో ‘ప్యాటర్‌నిటీ లీవ్’ తీసుకున్నాడు. ఈ అంశం వార్తల్లో ప్రముఖంగా ప్రచారం కూడా అయింది. అయితే, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పరాగ్ అగర్వాల్ ‘డాడీ లీవ్’పై ప్రత్యేకంగా రియాక్ట్ అయింది. ‘అబౌట్ టైం దిస్ ఇజ్ నార్మలైజ్డ్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. 


బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లులు ‘మ్యాటర్‌నిటి లీవ్’ తీసుకోవటం మనకు తెలిసిందే. అది సర్వసాధారణం. తండ్రులు కూడా అలాగే ‘ప్యాటర్‌నిటి లీవ్’ తీసుకుని డెలివరీకి సిద్ధంగా ఉన్న తమ భార్యల పక్కన ఉండాలని అనుష్క అంటోంది. నెలలు నిండుతోన్న కొద్దీ ఏ గర్భవతి అయినా అనేక ఉద్వేగాలకు లోనవుతూ ఉంటుంది. శారీరికంగా, మానసికంగా ఆమె ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటుంది. అటువంటి కీలక క్షణాల్లో భర్త తన పక్కనుండాలని సహజంగానే కోరుకుంటుంది. అందుకే, తండ్రి కాబోయే మగవారు కూడా వృత్తి, ఉద్యోగాలకు సెలవు పెట్టి ‘ప్యాటర్‌నిటి లీవ్’లో భాగంగా కొన్నాళ్లు భాగస్వామితో గడపాలనే వాదన బలంగా వినిపిస్తోంది. అనుష్క తాజాగా అదే మాటని సమర్థించింది. 


ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో బిజీగా ఉండే విరాట్ 2020లో అనుష్క ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఆమె పక్కనే ఉన్నాడు. మెటా(ఫేస్‌బుక్) సీఈవో మార్క్ జూకర్‌బెర్గ్ కూడా తనకు కూతుళ్లు జన్మించిన సందర్భంలో ‘ప్యాటర్‌నిటి లీవ్’ తీసుకుని ఇంటిపట్టున ఉండిపోయాడు. లెటెస్ట్‌గా ట్విట్టర్ సీఈవో కూడా అదే బాట పట్టాడు. ‘డాడీ లీవ్’లో భాగంగా ఆయన కొన్నాళ్లు ఆఫీస్ బాధ్యతలకు దూరంగా ఉండనున్నాడు... 

Updated Date - 2022-02-18T01:19:48+05:30 IST