Hijab row: తల గురించి ఎవరైన అలా మాట్లాడారా.. ఆ నాయకులకి నటి సూటి ప్రశ్న..

ABN , First Publish Date - 2022-03-06T18:28:57+05:30 IST

కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయమై ప్రస్తుతానికి అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది...

Hijab row: తల గురించి ఎవరైన అలా మాట్లాడారా.. ఆ నాయకులకి నటి సూటి ప్రశ్న..

కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయమై ప్రస్తుతానికి అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు సినీ సెలబ్రిటీలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. తాజాగా మరో బాలీవుడ్ నటి, స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో స్పందించింది.


ట్వింకిల్ చేసిన ట్వీట్‌లో.. ‘‘బుర్గాస్, హిజాబ్‌లు, ఘుంగాట్‌లు వాటిని ఉద్దేశించిన పరిస్థితుల నుంచి మతపరమైన, సాంస్కృతిక అంశాలుగా మారాయి. నేను ఏ విధమైన వేషధారణకి అనుకూలంగా లేను. అయినప్పటకీ ఇరుపక్షాల బెదిరింపులకు లొంగకుండా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉంది.


పురుషుల నుంచి రక్షణగా, వారిని టెంప్ట్ చేయకుండా ఉండేందుకు హిజాబ్ ఉపయోగపడుతుందని కొందరు మతవాద నాయకులు మాట్లాడుతున్నారు. ఈ భాయ్ సాబ్‌లందరూ ఈ విషయంలో సందేహాలు తీర్చాలి. చాలా కొద్దిమంది మాత్రమే తలని శృంగారపరమైన అవయవంగా చూస్తారు. ఎక్కడైనా డేట్ రోజున సంభాషణలో మగాడు.. ‘వావ్ ఈ రోజు మీ తల ఎంతో హాట్‌గా ఉంది’ అని చెప్పాడా. దానికి ఓ మహిళ.. ‘ధన్యవాదాలు డార్లింగ్ నా తలని ఈ షేప్‌లో ఉంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాను’ అని చెప్పిందా’’ అంటూ రాసుకొచ్చింది.


అలాగే, ట్వింకిల్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ.. ‘మాజీ హాస్యనటుడు జెలెన్స్కీ గ్లోబల్ హీరో అయ్యారు. ఆయన చర్యల వల్లే ఎనో తెలివి తేటలున్న ప్రపంచం మొత్తం పుతిన్‌ వైపు కాకుండా ఉక్రెయిన్ వైపు నిలబడింది’ అని చెప్పుకొచ్చింది.



Updated Date - 2022-03-06T18:28:57+05:30 IST