Koffee With Karan కుదరదుగానీ... Tea with Twinkle సాధ్యమేనట!

ABN , First Publish Date - 2022-05-13T02:08:19+05:30 IST

‘కాఫీ విత్ కరణ్’ షోలో గతంలో ట్వింకిల్ ఖన్నా కూడా పొల్గొంది. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు భర్త అక్షయ్ కుమార్ తో కలసి ఆమె సరదాగా సమాదానాలు ఇచ్చింది. ‘మిసెస్ ఫన్నీబోన్స్’గా ప్రసిద్ధికెక్కిన ట్వింకిల్ కేవలం హాస్యం మాత్రమే కాదు... వ్యంగ్యం కూడా అద్భుతంగా సంధిస్తుంది. అందుకే, ఆమె రచనలకి, ఇంటర్వ్యూలకి బోలెడు క్రేజ్. కాకపోతే, తాజాగా మొదలు కానున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆమె పాల్గొనబోవటం లేదట!

Koffee With Karan కుదరదుగానీ...  Tea with Twinkle సాధ్యమేనట!

‘కాఫీ విత్ కరణ్’ షో గురించి తెలియని వారు చాలా అరుదు. అయితే, టీవీ తెరపై సూపర్ సక్సెస్ అయిన సెలబ్రిటీ టాక్ షో త్వరలో ఓటీటీలో అలరించనుంది. ‘కాఫీ విత్ కరణ్’ లెటెస్ట్ సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు కౌంట్ డౌన్ మొదలైపోయింది... 


‘కాఫీ విత్ కరణ్’ షోలో గతంలో ట్వింకిల్ ఖన్నా కూడా పొల్గొంది. హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు భర్త అక్షయ్ కుమార్ తో కలసి ఆమె సరదాగా సమాదానాలు ఇచ్చింది. ‘మిసెస్ ఫన్నీబోన్స్’గా ప్రసిద్ధికెక్కిన ట్వింకిల్ కేవలం హాస్యం మాత్రమే కాదు... వ్యంగ్యం కూడా అద్భుతంగా సంధిస్తుంది. అందుకే, ఆమె రచనలకి, ఇంటర్వ్యూలకి బోలెడు క్రేజ్. కాకపోతే, తాజాగా మొదలు కానున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆమె పాల్గొనబోవటం లేదట!  


కరణ్ జోహర్ టాక్ షోలో గెస్టులు ఎవరో ఇంకా క్లారిటీ లేదు. కానీ, ట్వింకిల్ ఖన్నా మాత్రం ‘‘కాఫీ విత్ కరణ్ చేయలేను... టీ విత్ ట్వింకిల్ మాత్రం చేయగలను...’’ అంటూ సొషల్ మీడియా పోస్ట్ పెట్టింది. తల మీద వెంట్రుకల్ని రోల్ చేస్తూ... నెత్తిన రోలర్స్ ధరించిన ఆమె... చేతిలో కప్పు పట్టుకుని కెమెరాకు ఫోజిచ్చింది. కరణ్ తో కాఫీ కుదరదు కానీ... ట్వింకిల్ తో టీ సాధ్యమే అంటోంది... 



‘టీ విత్ ట్వింకిల్’ అన్న మాటల్లోని అంతరార్థం ఏమిటోగానీ... నెటిజన్స్ మాత్రం మిసెస్ అక్షయ్ కుమార్ పోస్టుకి హుషారుగా స్పందించారు...

‘‘టీ విత్ ట్వింకిల్... వినటానికే భలేగా ఉంది’’

‘‘ప్లీజ్! టీ విత్ ట్వింకిల్ కరణ్ జోహర్ తో చేయండి...’’

‘‘టీ విత్ ట్వింకిల్ షో కాఫీ విత్ కరణ్ కి గట్టి పోటి ఇవ్వగలదు’’

‘‘టీ విత్ ట్వింకిల్ లో కాఫీ విత్ కరణ్ లా కాకుండా... బోలెడు వ్యంగ్యం, జ్ఞానం, హాస్యం, అత్యంత తక్కువగా పుకార్లు ఉంటాయి...’’

‘‘కరణ్ జోహర్ కి ఈ పోస్ట్ నచ్చకపోవచ్చు...’’ 


1995లో ‘బర్సాత్’ సినిమాతో హీరోయిన్ అయిన ట్వింకిల్ ఖన్నా 2001లో ‘లవ్ కే లియే ఖుచ్ బీ కరేగా’’ సినిమా చేసి నటిగా కెరీర్ ముగించేసింది. తనకు యాక్టింగ్ అస్సలు రాదని స్వయంగా ఒప్పుకునే ఆమె రచయితగా మాత్రం కొంతకాలంగా సత్తాను చాటుతోంది. 2015లో ‘మిసెస్ ఫన్నీ బోన్స్‘ పుస్తకం విడుదల చేసిన ట్వింకిల్ 2017లో ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్’ అనే కథా సంపుటి ప్రచురించింది. తరువాతి సంవత్సరం ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ నవలతో ఆకట్టుకుంది. చూడాలి మరి, రాతలతో క్రేజీ రైటర్ గా దూసుకుపోతోన్న ఈ మాజీ హీరోయిన్ త్వరలో ‘టీ విత్ ట్వింకిల్’ అంటూ మాటలు కూడా మొదలెడుతుందేమో! 

Updated Date - 2022-05-13T02:08:19+05:30 IST