ఆన్‌లైన్‌లో ఫోన్ నెంబర్ లీక్.. నటిపై లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-04-05T19:57:02+05:30 IST

ప్రముఖ టీవీ నటి విభూతి ఠాకూర్‌‌ ఫోన్ నెంబర్ ఇటీవలే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. నెట్‌లో ఈ నటి ఫోన్ నెంబర్ సంపాదించిన కొందరు వ్యక్తులు..

ఆన్‌లైన్‌లో ఫోన్ నెంబర్ లీక్.. నటిపై లైంగిక వేధింపులు

ప్రముఖ హిందీ టీవీ నటి విభూతి ఠాకూర్‌‌  ఫోన్ నెంబర్ ఇటీవలే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. నెట్‌లో ఈ నటి ఫోన్ నెంబర్ సంపాదించిన కొందరు వ్యక్తులు ఆమెకి ఫోన్ చేసి లైంగికంగా వేధింపులకి గురిచేశారని సైబర్ క్రైమ్‌ సెల్‌కి ఫిర్యాదు చేసింది. 


ఈ ఫిర్యాదు గురించి విభూతి మీడియాతో మాట్లాడుతూ.. ‘మొదట ఎవరో నాతో ప్రాంక్ చేస్తున్నారని అనుకున్నాను. అనంతరం కూడా వివిధ నెంబర్‌లు, వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయి. అందులో కొందరూ నన్ను లైంగికంగా ఫేవర్స్ గురించి అడిగారు. అలాంటి భయకరమైన, అవమానకరమైన మేస్సేజ్‌లు చేశారు. అవి నన్ను మానసికంగా ఎంతో ప్రభావితం చేశాయి. అందుకే సైబర్ సెల్‌కి ఫిర్యాదు చేశాను. నా నెంబర్‌ని ఆన్‌లైన్‌లో లీక్ చేసిన వారిని పోలీసులు కనుగొంటారని ఆశిస్తున్నాను. నన్ను వేధిస్తూ మేస్సేజులు చేసిన వారందరినీ పట్టుకోవాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా విభూతి ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం ఆన్‌లైన్‌లో తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి తెలియజేసింది. నటి చేసిన పోస్ట్‌లో.. ‘నా నెంబర్ ఆన్‌లైన్‌లో సర్కులేట్ అవడం నన్ను విపరీతమైన మానసిక క్షోభకు గురి చేసింది. ఇది నన్ను బెదిరించేందుకు ఎవరో చేసిన చర్య. ఇలా చేయడం సిగ్గుచేటు. నన్ను అగౌరవపరిచేందుకే ఇలా చేశారు. 


ఎవరిని డిస్టర్బ్ చేయకుండా తనపని తాను చేసుకుపోతున్న అమ్మాయిని, ఇబ్బంది పెట్టాలని ఎవరు, ఎందుకు అనుకున్నారో నాకు తెలియడం లేదు. వారి చేసిన పని వల్ల అవమానకరమైన మెస్సేజులు, కాల్స్‌లో ఇబ్బంది పడ్డాను. అందుకే కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ స్కిన్‌షాట్‌కి సంబంధించిన వ్యక్తి‌పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. నాకు సంబంధించి అలాంటి సందేశాలు ఎవరైనా చేస్తే నాకు తెలియజేయండి’ అంటూ రాసుకొచ్చింది.





Updated Date - 2022-04-05T19:57:02+05:30 IST