Karthikeya 2 Tulasi: ఎవరు ఆపుతారో చూసుకుందాం!

ABN , First Publish Date - 2022-08-27T21:54:56+05:30 IST

‘‘కార్తికేయ–2’ చిన్న చిత్రంగా మొదలై రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి దేశం మొత్తం మాట్లాడుకునే స్థాయికి చేరింది. కంటెంట్‌ గొప్పదైతే.. సినిమాను ఏ స్థాయికైనా తీసుకెళ్లడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారని ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారని మరోసారి నిరూపితమైంది. చిన్న ఎలుక ఓ రంధ్రం చేసి దాని ద్వారా ఏమైనా చేయగలదు.

Karthikeya 2 Tulasi:  ఎవరు ఆపుతారో చూసుకుందాం!

‘‘కార్తికేయ–2 (Karthikeya 2)’ చిన్న చిత్రంగా మొదలై రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి దేశం మొత్తం మాట్లాడుకునే స్థాయికి చేరింది. కంటెంట్‌ గొప్పదైతే.. సినిమాను ఏ స్థాయికైనా తీసుకెళ్లడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారని ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారని మరోసారి నిరూపితమైంది. చిన్న ఎలుక ఓ రంధ్రం చేసి దాని ద్వారా ఏమైనా చేయగలదు. అలాగే ఓ బలమైన కథ ఎంతదూరమైన వెళ్లగలదు అని ‘కార్తికేయ–2’ నిరూపించింది’’ అని సీనియర్‌ నటి తులసి (Tulasi) అన్నారు. శుక్రవారం కర్నూల్‌లో జరిగిన సక్సెస్‌ ఈవెంట్‌లో తులసీ భావోద్వేగంగా మాట్లాడారు. విడుదలైన అన్ని భాషల్లోనూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు పేరుపేరున పాదాభివందనాలు అంటూ వేదికపై శిరస్సు వంచి నమస్కరించారు. (karthikeya 2 success event)

 

ఈ సందర్భంగా తులసి (Tulasi emotional speech)మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి తల్లి చందూ మొండేటి. ఒక తల్లి మాత్రమే దేశం మొత్తం మీద ఇంత ఆప్యాయత సంపాదించుకోగలదు. ఒక చిన్న సినిమాగా మొదలైన సినిమా గురించి దేశం మొత్తం తెలిసింది. చందూ మొండేటి ఎవరు అని సెర్చ్‌ చేస్తున్నారు. నాకు ఆస్ట్రేలియా నుంచి ఒక కాల్‌ వచ్చింది. ‘ఈ సినిమా దర్శకుడు లెక్చరర్‌గా పనిచేశారా? లేదా టీచరా అని అడిగారు. నాకు తెలీదు. అడిగి తెలుసుకోవాలి అన్నాను. ఎందుకంటే ఈ సినిమాను ఇంత డెఫినేషన్స్‌తో చెప్పగలిగాడు అంటూ దీనికి వెనుక ఎంత కృషి చేశాడనేది తెలుస్తోంది. భాషలు చాలా ఉండొచ్చు భావం అనేది చాలా ముఖ్యం ఈ సినిమా కూడా అంతే. అందరికీ అర్థమయ్యేలా సినిమా తీశారు. తల్లిని ఎంత ప్రేమగా చూసుకోవాలో చూపించాడు. కృష్ణుడు ఓ అల్లరి పిల్లాడనీ, తల్లిని అమితంగా ప్రేమించేవాడనీ, తర్వాత అన్నీ నేర్చుకున్నాడు.. జనాలకు వదిలేశాడని చెప్పారు. ఇప్పుడు నాకు అందరూ కృష్ణుడిల్లాగే కనిపిస్తున్నారు.. మీకు ఆభరణాలు కిరీటాలు అవసరం లేదు. మంచి మనసుతో ఫోకస్డ్‌గా ఉండాలంతే. అప్పుడు ప్రతి ఒక్కరూ కార్తికేయ అవుతారన్నదే ఈ చిత్రం. దీనిని చాలా చిన్న సినిమా అనుకున్నారు. చిట్టెలుక ఓ రంధ్రం చేసింది అంటే దాని ద్వారా అది ఎన్నో చేస్తుంది. ఈ సినిమాకు మేం చిన్నవాళ్లమే కావచ్చు.. కానీ ప్రపంచం మమ్మల్ని ఎంతో ఎత్తులో నిలబెట్టేసింది.. ప్రేక్షకుల ప్రేమ, ఆప్యాయతలే ఈ చిత్రం. వంద కోట్ల డబ్బు రాబట్టడం విషయం కాదు. వంద కోట్ల మంది ప్రేక్షకుల ప్రేమ దొరకడం ముఖ్యం. ఇప్పుడు రమ్మనండి. ఈ సినిమాను ఎవరు ఆపుతారో చూసుకుందాం. నేను సినిమాల్లో పుట్టి పెరిగాను. 55 ఏళ్లుగా ఇక్కడే ఉన్నా. నేనే ఇంతకాలం ఉండగలిగాను అంటే.. ఎవ్వరైనా ఇక్కడ ఉండగలరు’’ అని చెప్పుకొచ్చారు. 


Updated Date - 2022-08-27T21:54:56+05:30 IST