అయ్యబాబోయ్.. సజ్జనార్ అస్సలు తగ్గడం లేదుగా!!

ABN , First Publish Date - 2022-03-16T02:33:35+05:30 IST

టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పబ్లిసిటీ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ‘పుష్ప’ డైలాగ్‌లా ‘తగ్గేదే లే’ అంటూ దూసుకుపోతున్నారు. కాస్త పాపులర్ అయిన సినిమా పోస్టర్ ఏది విడుదలైనా.. దానిని టిఎస్ఆర్టీసీ పేరుతో ప్రచారానికి వాడుకుంటూ

అయ్యబాబోయ్.. సజ్జనార్ అస్సలు తగ్గడం లేదుగా!!

టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పబ్లిసిటీ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ‘పుష్ప’ డైలాగ్‌లా ‘తగ్గేదే లే’ అంటూ దూసుకుపోతున్నారు. కాస్త పాపులర్ అయిన సినిమా పోస్టర్ ఏది విడుదలైనా.. దానిని టిఎస్ఆర్టీసీ పేరుతో ప్రచారానికి వాడుకుంటూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. అలా ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ అర్థమే మార్చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అంటే ‘రాష్ట్ర రోడ్డు రవాణా’ అంటూ కొత్త అర్థాన్ని చెప్పారు. అంతేకాదు, తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ సాంగ్‌ని కూడా ఆయన ప్రచారానికి వాడేశారు. 


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ జెండా పట్టుకుని పాడుతున్న పాటలో.. జెండాపై మాములుగా ‘వందేమాతరం’ అని ఉంటే, తాజాగా సజ్జనార్ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో తన క్రియేటివిటీని ప్రదర్శించారు. చరణ్, తారక్ పట్టుకున్న జెండాపై.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసీ)కు సంబంధించిన అక్షరాలతో పాటు లోగోని, బస్సుని పెట్టి రెపరెపలాడించారు. దీనిని చూసిన నెటిజన్లు.. సజ్జనార్ క్రియేటివిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం సజ్జనార్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకాబోతోంది.



Updated Date - 2022-03-16T02:33:35+05:30 IST