Allu arjun: వడా పావ్‌!

ABN , First Publish Date - 2022-06-26T17:04:34+05:30 IST

‘పుష్ప’(Pushpa) సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Iconstar allu arjun). ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప–2’(Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘పుష్పరాజ్‌’ లుక్‌లో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట రెండ్రోజులుగా వైరల్‌ అవుతోంది. ప్రింట్‌ వేసిన టీషర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించిన ఆయన ఫొటోను మనవ్‌ మంగ్లాని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

Allu arjun: వడా పావ్‌!

‘పుష్ప’(Pushpa) సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Iconstar allu arjun).  ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప–2’(Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘పుష్పరాజ్‌’ లుక్‌లో ఉన్న ఫొటో ఒకటి నెట్టింట రెండ్రోజులుగా వైరల్‌ అవుతోంది. ప్రింట్‌ వేసిన టీషర్ట్‌, బ్లాక్‌ ప్యాంట్‌ ధరించిన ఆయన ఫొటోను మనవ్‌ మంగ్లాని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. అందులో పుష్ప గెటప్‌లో బన్నీ కాస్త లావుగా కనిపించడంతో నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. కొందరు బన్నీ స్టైలిష్‌ లుక్‌, హెయిర్‌ స్టైల్‌ అదిరిందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ‘బన్నీ రోజురోజుకీ బుద్దాలాగా కనిపిస్తున్నారని, క్రికెటర్‌ మలింగాలా ఉన్నారనీ అంటున్నారు. మరో నెటిజన్‌ అయితే ‘వడా పావ్‌’ అని సంభోదించారు. ప్రస్తుతం ఈ ఫొటో, నెటిజన్ల కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. (bunny photos viral)


‘పుష్ప–2’ క్యారెక్టర్‌ కోసం బన్నీ కాస్త ఫ్యాటీగా కనిపిస్తున్నారని మరి కొందరు అంటున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక మందన్నా కథానాయిక. 




Updated Date - 2022-06-26T17:04:34+05:30 IST