Trivikram: ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుందా..?

ABN , First Publish Date - 2022-08-21T15:08:14+05:30 IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది మహేష్ బాబు కెరీర్‌లో రూపొందుతున్న 28వ సినిమా.

Trivikram: ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుందా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది మహేష్ బాబు కెరీర్‌లో రూపొందుతున్న 28వ సినిమా. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టా స్టోరీ ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ సాధించలేదు.


దాంతో ఇప్పుడు చేస్తున్న మూవీతో భారీ హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. అయితే, ఓ వైపు మహేష్ సినిమా షూటింగ్ జరుపుతూనే మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించబోతున్న సినిమా స్క్రిప్ట్‌ను కూడా తయారు చేస్తున్నారట. తమిళ సూపర్ హిట్ చిత్రం 'వినోదయ్య సిత్తం' ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన సముద్రఖని ఇప్పుడు తెలుగు వెర్షన్‌కి కూడా దర్శకత్వం వహించబోతున్నారు. 


ఈ మూవీ రీమేక్ స్క్రిప్ట్ చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి అప్పగించారు. ఆయన ప్రస్తుతం తెలుగు రీమేక్ కోసం స్క్రిప్ట్ ను సాయి మాధవ్ బుర్రతో కలిసి రెడీ చేస్తున్నారట. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించేందుకు గురూజీ బాగానే శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. మామ, అల్లుడు కలిసి నటించబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని సమచారం.

Updated Date - 2022-08-21T15:08:14+05:30 IST