Sharwanand: పొలిటికల్ యాక్షన్ డ్రామాకి.. త్రివిక్రమ్ టచ్!

ABN , First Publish Date - 2022-09-06T02:57:49+05:30 IST

టైటిల్ చూసి.. శర్వానంద్ (Sharwanand) సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఏమైనా పని చేయబోతున్నాడని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదులే కానీ.. ఆయన నూతన

Sharwanand: పొలిటికల్ యాక్షన్ డ్రామాకి.. త్రివిక్రమ్ టచ్!

టైటిల్ చూసి.. శర్వానంద్ (Sharwanand) సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఏమైనా పని చేయబోతున్నాడని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదులే కానీ.. ఆయన నూతన చిత్రానికి మాటల మాంత్రికుడు క్లాప్ కొట్టి.. యూనిట్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 33వ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకుడు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తుంది. పూజా కార్యక్రమాలలో ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ కొట్టగా.. చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, యువి క్రియేషన్స్ వంశీ-విక్రమ్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేయగా.. కృష్ణ చైతన్య స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుందని నిర్మాతలు తెలిపారు. 


ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘పవర్ ఫుల్ స్క్రిప్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శర్వానంద్‌ని ఇంటెన్స్ క్యారెక్టర్‌లో చూపించనున్నారు కృష్ణ చైతన్య. శర్వా సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. మరికొందరు ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం, జిమ్షీ ఖలీద్ సినిమాటోగ్రఫీ, జయశ్రీ ప్రొడక్షన్ డిజైనర్, విటల్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేయనున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాము..’’ అని తెలిపారు. (Sharwanand New Film)











Updated Date - 2022-09-06T02:57:49+05:30 IST