TRISHA : మీకు ఎన్ని రోగ లక్షణాలు తెలుసు... అవన్నీ నాకు అనుభవంలోకి వచ్చాయి

ABN , First Publish Date - 2022-01-09T19:52:42+05:30 IST

సెలబ్రిటీలకు కరోనా సెగ తగులుతూనే ఉంది. తాజాగా తన కోవిడ్ కష్టాలు ట్విట్టర్‌లో వెల్లడించింది కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిషా. ఆమెకి కూడా 2021 వెళుతు వెళుతు షాకిచ్చిందట. మహమ్మారి బారినపడిన త్రిషా తీవ్రమైన ఇబ్బంది అనుభవించాల్సి వచ్చిందట. కొత్త సంవత్సరంలోకి నీరసంగా కాలుమోపానంటోంది టాలెంటెడ్ యాక్ట్రస్.

TRISHA : మీకు ఎన్ని రోగ లక్షణాలు తెలుసు... అవన్నీ నాకు అనుభవంలోకి వచ్చాయి

సెలబ్రిటీలకు కరోనా సెగ తగులుతూనే ఉంది. తాజాగా తన కోవిడ్ కష్టాలు ట్విట్టర్‌లో వెల్లడించింది కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిషా. ఆమెకి కూడా 2021 వెళుతు వెళుతు షాకిచ్చిందట. మహమ్మారి బారినపడిన త్రిషా తీవ్రమైన ఇబ్బంది అనుభవించాల్సి వచ్చిందట. కొత్త సంవత్సరంలోకి నీరసంగా కాలుమోపానంటోంది టాలెంటెడ్ యాక్ట్రస్. 


‘‘కొత్త సంవత్సరానికి కొద్ది రోజుల ముందే నాకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మీకు ఎన్ని రోగ లక్షణాలు తెలుసో... అవన్నీ నాకు అనుభవంలోకి వచ్చాయి’’ అంటూ త్రిషా ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది. ‘‘యూ నేమ్ ద సింప్టమ్స్, ఐ హ్యాడ్ ఇట్’’ అని ఆమె చెప్పటాన్నిబట్టి చూస్తే ‘వర్షం’ బ్యూటీ కరోనా తీవ్రత ఎక్కువగానే ఉండిందని మనం భావించవచ్చు. అయితే, త్రిషా ఫ్యాన్స్‌కి బిగ్ రిలీఫ్ ఏంటంటే... ఆమె ప్రస్తుతం వైరస్ ఎఫెక్ట్ నుంచీ పూర్తిగా బయటపడిందట. క్రమంగా కోలుకుంటున్నానని చెప్పింది. వ్యాక్సినేషన్స్ ప్రభావం వల్ల ప్రమాదం తప్పిందంటోన్న త్రిషా అందర్నీ మాస్కులు ధరించమంటూ, టీకాలు వేయించుకోమంటూ... పిలుపునిచ్చింది. 

Updated Date - 2022-01-09T19:52:42+05:30 IST