Chandramukhi 2‌ కథానాయికగా సీనియర్ బ్యూటీ?

ABN , First Publish Date - 2022-06-29T17:43:56+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘చంద్రముఖి’ (Chandrmukhi). పి.వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ దుమ్మురేపేసింది. ‘మణిచిత్రతాళు’ (Manichitrathazhu) మలయాళ చిత్రాన్ని కొద్దిపాటి మార్పులతో కన్నడలో ‘ఆప్తమిత్ర’ (Apthamitra) గా వాసు రీమేక్ చేయగా.. ఆ సినిమానే ‘చంద్రముఖి’ గా రజనీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చారు.

Chandramukhi 2‌ కథానాయికగా సీనియర్ బ్యూటీ?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ ‘చంద్రముఖి’ (Chandrmukhi). పి.వాసు దర్శకత్వంలో 2005లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ దుమ్మురేపేసింది. ‘మణిచిత్రతాళు’ (Manichitrathazhu) మలయాళ చిత్రాన్ని కొద్దిపాటి మార్పులతో కన్నడలో ‘ఆప్తమిత్ర’ (Apthamitra) గా వాసు రీమేక్ చేయగా.. ఆ సినిమానే ‘చంద్రముఖి’ గా రజనీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చారు. అప్పట్లోనే కన్నడలో దానికి ‘ఆప్తరక్షక’ (Aptha Rakshaka) అనే సీక్వెల్ తీసిన దర్శకుడు.. తెలుగులో వెంకీ (Venky) తో ‘నాగవల్లి’ (Nagavalli) గా రీమేక్ చేశారు. అయితే ఆ టైమ్‌లో తమిళంలో మాత్రం ఈ సినిమాకి రెండో భాగం రాలేదు. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తమిళంలో ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా కన్నడ ‘ఆప్తరక్షక’ చిత్రానికి సీక్వెలా కాదా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఈ సినిమాపై జనం కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. 


రాఘవ లారెన్స్ (Raghava Lawarence) హీరోగా ‘చంద్రముఖి 2’ చిత్రం తెరకెక్కబోతోంది. ఇంతకు ముందు లారెన్స్.. ‘ముని’ (Muni) సిరీస్ లోని నాలుగు భాగాలతో తమిళంలో పాటు తెలుగులోనూ సక్సెస్ అందుకొని హారర్ చిత్రాలకు బ్రాండ్ గా మారాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. మొదటి భాగంలో కామెడీ పరంగా హైలైట్ గా నిలిచిన వడివేలు (Vadivelu) పాత్రను రెండో భాగంలోనూ కంటిన్యూ చేయబోతున్నారు. మొదటి భాగంలో నయనతార (Nayanathara) కథానాయికగా నటించగా..  రెండో భాగంలో సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కథానాయికగా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో నటించడానికి త్రిష భారీ పారితోషికం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇక అతి ముఖ్యమైన మరో విషయం ఏంటంటే.. ఈ సినిమాకి యం.యం.కీరవాణి (MM Keeravani) సంగీతం అందించబోతున్నారు. తన కెరీర్ లోనే తొలిసారిగా ఆయన ఓ హారర్ సినిమాకు సంగీతం అందించనుండడం విశేషం. 


ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘చంద్రముఖి 2’ చిత్రం అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టనుంది. మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన పి వాసు (P Vasu) నే రెండో భాగానికీ దర్శకుడు. తెలుగులో కూడా విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏ టైటిల్ ఖాయం చేస్తారనే ఆసక్తి కలుగుతోంది. మరి చంద్రముఖి 2 చిత్రం మొదటి భాగాన్ని మించిన స్థాయిలో సక్సెస్ అవుతుందేమో చూద్దాం.  

Updated Date - 2022-06-29T17:43:56+05:30 IST