దుల్కర్ సల్మాన్‌ సినిమా పాటని లాంచ్ చేసిన టాప్ హీరోయిన్లు

ABN , First Publish Date - 2022-03-02T21:09:36+05:30 IST

‘మహానటి’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన నటుడు దుల్కర్ సల్మాన్. ఈ యువ నటుడు ప్రస్తుతం కాజల్ అగర్వాల్, అదితిరావ్ హైదరితో కలిసి ‘హే సినామిక’ అనే సినిమాలో నటించగా..

దుల్కర్ సల్మాన్‌ సినిమా పాటని లాంచ్ చేసిన టాప్ హీరోయిన్లు

‘మహానటి’ సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన నటుడు దుల్కర్ సల్మాన్. ఈ యువ నటుడు ప్రస్తుతం కాజల్ అగర్వాల్, అదితిరావ్ హైదరితో కలిసి ‘హే సినామిక’ అనే సినిమాలో నటించగా.. బృంద దర్శకత్వం వహించింది. ఈ చిత్రం మార్చి 3న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ని అందుకుంది. 


తాజాగా ఈ సినిమా నుంచి ‘సిరిగై’ అనే పాట విడుదలైంది. ఈ సాంగ్‌ని స్టార్ హీరోయిన్స్ త్రిష, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, మంజు వారియర్, కీర్తీ సురేశ్ ఆయా భాషల్లో మార్చి 1న విడుదల చేశారు. వివాహ సమయంలో వచ్చే ఈ పాటలో కాజల్, అదితి నటించారు. నార్త్ ఇండియన్ స్టైల్‌లో సాగే ఈ సాంగ్ విడుదలైనప్పటి నుంచే మంచి రెస్పాన్స్‌ని అందుకుంటోంది.



Updated Date - 2022-03-02T21:09:36+05:30 IST