SIIMA: మొదటి రోజు సందడి చేయనున్న స్టార్స్ వీరే

ABN , First Publish Date - 2022-09-10T23:44:36+05:30 IST

దక్షిణాదిలోనే ప్రతిష్ఠాత్మమైనవి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (సైమా) (SIIMA) అవార్డ్స్. సైమా 10వ ఎడిషన్ బెంగళూరులో జరగనుంది. ఈ పురస్కారాలను సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 11న ప్రదానం

SIIMA: మొదటి రోజు సందడి చేయనున్న స్టార్స్ వీరే

దక్షిణాదిలోనే ప్రతిష్ఠాత్మమైనవి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (సైమా) (SIIMA) అవార్డ్స్. సైమా 10వ ఎడిషన్ బెంగళూరులో జరగనుంది. ఈ పురస్కారాలను సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 11న ప్రదానం చేయనున్నారు. సైమా అవార్డ్స్‌ను అందజేయడం 2012నుంచి ప్రారంభమైంది. తాజాగా 10వ సారి పురస్కారాలను అందజేయనున్నారు. ఇందూరి విష్ణు వర్ధన్, అడుసిమిల్లి బృంద ప్రసాద్ ఈ అవార్డ్స్‌కు వ్యవస్థాపకులు.    


బెంగళూరులోని గార్డెన్ సిటీలో సైమా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ వేడుక రెండు రోజుల పాటు జరగనుంది. దక్షిణాదికి చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. ఈ ఫంక్షన్‌కు తొలి రోజు కమల్ హాసన్ (KamalHaasan), అల్లు అర్జున్ (AlluArjun), యశ్ (Yash), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హాజరు కానున్నారు. ఫరియా అబ్దుల్లా, శ్రీ లీల తమ నృత్యాలతో అలరించనున్నారు. అవార్డ్స్ కోసం వివిధ కేటగీరీల్లో తెలుగు నుంచి అనేక చిత్రాలు పోటీపడుతున్నాయి. వివిధ విభాగాల్లో ‘పుష్ప: ది రైజ్-పార్ట్ 1’ 12 నామినేషన్స్, ‘అఖండ’ 10 నామినేషన్స్, ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’ ఎనిమిదేసి చొప్పున నామినేషన్స్ సాధించాయి. పబ్లిక్ పోలింగ్, సీనియర్ ఆర్టిస్ట్స్, ప్రొఫెషనల్స్‌తో కూడిన జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తుంది. గతేడాది సైమా అవార్డ్స్‌ను హైదరాబాద్‌‌లో ప్రదానం చేశారు.    



Updated Date - 2022-09-10T23:44:36+05:30 IST