Puneeth Rajkumar కెరీర్లోనే టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2021-10-29T21:22:31+05:30 IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొద్ది గంటల ముందే మరణించారు. జిమ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విక్రమ్ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయత్నం లేకుండా పోయింది.

Puneeth Rajkumar కెరీర్లోనే టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదీ..!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొద్ది గంటల ముందే మరణించారు. జిమ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో విక్రమ్ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రయత్నం లేకుండా పోయింది.  ఆయన మరణ వార్తతో కన్నడ సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. అభిమానులందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన నటించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన  కొన్ని సినిమాలు మీకోసం... 


Bettada Hoovu

ఎల్. అరోరా రాసిన వాట్ దేన్ రామన్? అనే నవలను ఆధారంగా చేసుకుని  Bettada Hoovu సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆయన నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడిగా నటించారు. తన కలలను సాకారం చేసుకోలేని  యువకుడిగా ఈ సినిమాలో ఆయన కనిపించారు. తన నటన పటిమతో ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన కొల్లగొట్టారు. 


Chalisuva Modagalu

తన తండ్రి రాజ్ కుమార్ నటించిన అనేక సినిమాల్లో పునీత్ చిన్నతనంలో కనిపించారు. Chalisuva Modagalu సినిమా ఇంటెన్స్ డ్రామా అయినప్పటికీ పునీత్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆయన ఒక పాట కూడా పాడారు.


Bhakta Prahlada

పునీత్ రాజ్ కుమార్ తన సినీ కెరీర్‌లో నటించిన ఏకైక పౌరాణిక చిత్రం Bhakta Prahlada. ఈ సినిమాలో ఆయన తండ్రి కూడా నటించారు. ఆయన అమాయకత్వం ఈ సినిమాలో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. కొన్ని సీన్లల్లో ఆయన నటన మనల్ని కంటతడి పెట్టిస్తుంది. 


Appu

హీరోగా పునీత్ రాజ్ కుమార్ Appu చిత్రంతోనే అరంగ్రేటం చేశారు. ఆయన కెరీర్‌లోనే  విజయవంతమైన సినిమా ఇది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టడంతో ఆయనకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారంటే ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. 


Veera Kannadiga

రెండు టైమ్ జోన్లల్లో విభిన్న పాత్రల్లో ఈ సినిమాలో ఆయన కనిపించారు. ఈ మూవీలో ద్విపాత్రాభినయం పోషించారు. తండ్రి, కొడుకులుగా రెండు పాత్రలను ఆయనే పోషించడం గమనార్హం.  విప్లవ భావాలు ఉన్న తండ్రిగా ఈ సినిమాలో ఆయన కనిపించారు.


Milana

ఈ సినిమా విడుదల అయ్యే నాటికి పునీత్ రాజ్ కుమార్  పక్కింటి కుర్రాడిగా అందరికీ తెలుసు. కుటుంబ సమేతంగా చూడదగ్గ పాత్రలను మాత్రమే ఆయన పోషిస్తున్నారు. Milana సినిమా కుటుంబ ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేసింది. ఈ సినిమా థియేటర్లల్లో ఒక  ఏడాది పాటు ఆడింది. 


Prithvi

బల్లారి ప్రాంతంలోని అక్రమ గనుల తవ్వకం గురించి ఈ సినిమా చర్చిస్తుంది. ఈ చిత్రంలో ఆయనది పక్కింటి కుర్రాడి పాత్ర కాదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఐ‌ఏ‌ఎస్)గా ఈ మూవీలో ఆయన మనకు కనిపిస్తారు. బల్లారి ప్రాంతంలో అక్రమ గనుల తవ్వకంపై ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా పోరాడాడనే విషయాన్ని ఈ చిత్రం చర్చిస్తుంది.


Jackie

సూరి దర్శకత్వంలో మొదటిసారిగా పునీత్ రాజ్ కుమార్ ఈ చిత్రంలోనే నటించారు. Jackie చిత్రం విడుదల అయినప్పుడు కన్నడ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. ఆయన స్టార్‌డమ్‌ను ఈ సినిమా మరో మెట్టుకు ఎక్కించింది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రలో ఆయన  ఈ మూవీలో కనిపించారు.    


Paramathma

ఈ సినిమా ఆయనను కొత్త స్టైల్‌లో చూపించింది. Paramathma సినిమాకు యోగ్‌రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దర్శకుడు ఆయనను సరికొత్తగా చూపిస్తూ అభిమానులను థియేటర్ల వైపు నడిపించారు. ఈ సినిమా టీవీలో ప్రసారం అయినప్పుడు నేటికి ప్రేక్షకులు చూస్తారంటే అందులో అతిశయోక్తి లేదు.


Raajkumara

ఆయన కెరీర్ కొంత స్తబ్ధుగా కొనసాగుతున్నప్పుడు  Raajkumara సినిమాతో తిరిగి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఈ మూవీతోనే కుటుంబ సమేత ప్రేక్షకులకు తిరిగి ఆయన దగ్గరయ్యారు. 

Updated Date - 2021-10-29T21:22:31+05:30 IST