టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్ ఇదీ.. పెట్టిందెంత..? వచ్చిందెంత..? RRR ప్లేస్ ఏంటంటే..
ABN , First Publish Date - 2022-04-12T20:08:38+05:30 IST
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘ఆర్ఆర్ఆర్’ మ్యానియానే కనిపిస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న..
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ‘ఆర్ఆర్ఆర్’ మ్యానియానే కనిపిస్తోంది. బాహుబలితో పాన్ ఇండియా స్థాయి క్రేజ్ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటులు ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా విడుదల నుంచి మంచి టాక్ సొంతం చేసుకున్న ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ పరంగా ఇండియన్ మూవీస్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ తరుణంలో టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్, వాటి బడ్జెట్, టోటల్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం..
నెం సినిమా బడ్జెట్(కోట్లలో) కలెక్షన్స్ (కోట్లలో)
1. దంగల్ 75 1924.70
2. బాహుబలి 2 250 1749
3. RRR 550 1003 (ఇప్పటివరకు)
4. భజరంగీ భాయిజాన్ 90 858.8
5. సీక్రెట్ సూపర్‌స్టార్ -- 830.8
6. PK 85 966
7. 2.0 500 654.4
8. సుల్తాన్ 145 614.9
9. బాహుబలి 180 600.6
10. సంజు 96 580.1