ప్రియురాలితో కలసి... Spider-Man గృహప్రవేశం!

ABN , First Publish Date - 2022-01-31T03:33:59+05:30 IST

‘స్పైడర్ మ్యాన్’ పాత్రతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాడు టామ్ హోలాండ్. అయితే, స్పైడర్ మ్యాన్ సిరీస్ చిత్రాలు చేస్తుండగానే పాతికేళ్ల అందగాడికి ప్రియురాలు కూడా దొరికేసింది. ఆమే జెండయా. స్పైడర్ మ్యాన్ ఫ్రాంఛైజ్‌లో టామ్ హోలాండ్ గాళ్‌ఫ్రెండ్. తెర మీద లాగే తెర వెనుక కూడా వారిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. అంతే కాదు, ఓ ఇంటి వారు కూడా అయిపోయారు! అంటే... పెళ్లి చేసుకున్నారని కాదండోయ్...

ప్రియురాలితో కలసి... Spider-Man గృహప్రవేశం!

‘స్పైడర్ మ్యాన్’ పాత్రతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాడు టామ్ హోలాండ్. అయితే, స్పైడర్ మ్యాన్ సిరీస్ చిత్రాలు చేస్తుండగానే పాతికేళ్ల అందగాడికి ప్రియురాలు కూడా దొరికేసింది. ఆమే జెండయా. స్పైడర్ మ్యాన్ ఫ్రాంఛైజ్‌లో టామ్ హోలాండ్ గాళ్‌ఫ్రెండ్. తెర మీద లాగే తెర వెనుక కూడా వారిద్దరూ ప్రేమలో మునిగిపోయారు. అంతే కాదు, ఓ ఇంటి వారు కూడా అయిపోయారు! అంటే... పెళ్లి చేసుకున్నారని కాదండోయ్... 


టామ్ హోలాండ్ బ్రిటీష్ యాక్టర్. ఇక జెండయా అమెరికన్ బ్యూటి. మరి వీరిద్దరూ సహ జీవనం చేయాలంటే ఓ గూడు కావాలి కదా? అందుకే, యూకేలోని లండన్‌ మహానగరంలో ఉన్న రిచ్‌మాండ్ ప్రాంతంలో టామ్, జెండయా ఒక ఇల్లు కొనేశారు. మన కరెన్సీలో చెప్పుకుంటే వారి న్యూ హోమ్ వాల్యూ 30 కోట్లకు పైమాటే! అందులో ఆరు బెడ్ రూమ్స్‌తో పాటూ జిమ్, సినిమా లాంటి వసతులు కూడా ఉంటాయట. ప్రస్తుతం అక్కడే మన యంగ్ లవ్ బర్డ్స్ రొమాన్స్ కొనసాగిస్తున్నారు...


టామ్ హోలాండ్‌కి లండన్‌లో ఇంతకు ముందే ఓ ఇల్లు ఉంది. ఆ త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కి తాజాగా కోట్లు ఖరీదు చేసే నూతన భవనం కూడా తోడైంది. మరోవైపు, ఏంజిల్ ఫ్రమ్ లాస్ ఏంజిలిస్‌... జెండయాకు కూడా... యూఎస్‌లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసే భవంతి ఉంది. 

Updated Date - 2022-01-31T03:33:59+05:30 IST