టాలీవుడ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న కోలీవుడ్ హీరోయిన్..?

ABN , First Publish Date - 2022-03-18T20:45:39+05:30 IST

హీరోయిన్ సంజన గల్రానీ చెల్లెలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి నిక్కీ గల్రానీ. ఆమె త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతుందని తెలుస్తోంది. ఓ టాలీవుడ్ స్టార్ హీరోను వివాహమాడనుందని

టాలీవుడ్ స్టార్ హీరోను పెళ్లి చేసుకోబోతున్న కోలీవుడ్ హీరోయిన్..?

హీరోయిన్ సంజన గల్రానీ చెల్లెలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటి నిక్కీ గల్రానీ. ఆమె త్వరలోనే పెళ్లి పీటలను ఎక్కబోతుందని తెలుస్తోంది. ఓ టాలీవుడ్ స్టార్ హీరోను వివాహమాడనుందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే..


సౌత్‌లోని అన్ని భాషల్లో నిక్కీ గల్రానీ సినిమాలు చేసింది. ‘యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది. ఈ చిత్రం తెలుగులోను ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ సినిమా చేస్తున్నప్పుడే నిక్కీకి, ఆదితో పరిచయం ఏర్పడిందట. అనంతరం ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారిందని సమాచారం. దీంతో కొన్నేళ్లుగా వీళ్లు రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని వీరు నిర్ణయించుకున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆది పినిశెట్టి ఇంట్లో 2020 జులైలో జరిగిన ఓ ఫంక్షన్‌కు కూడా ఆమె హాజరైంది. ఈ ఫంక్షన్ జరిగిన కొన్ని నెలలకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వీరు జంటగా దర్శనమివ్వడంతో.. ఈ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది. 


నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఈ జంటతో సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి తెలిపారు. ‘‘ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ సన్నాహాలను ఇప్పటికే మొదలుపెట్టారు. త్వరలోనే పెళ్లి జరిగే తేదీని నిర్ణయిస్తారు’’ అని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తలపై ఆది, నిక్కీ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ జంట పెళ్లి చేసుకుంటారా, లేదా అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.  ‘సరైనోడు’, ‘నిన్ను కోరి’, ‘అజ్ఞాత వాసి’ వంటి సినిమాల్లో ఆది పినిశెట్టి నటించిన సంగతి అందరికీ తెలిసిందే.



Updated Date - 2022-03-18T20:45:39+05:30 IST