గత వారం OTT లో సినీ అభిమానులు తెగ చూసేసిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదీ..!

ABN , First Publish Date - 2022-05-19T02:04:15+05:30 IST

కరోనా అనంతరం ప్రజల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికీ ఇష్ట పడటం లేదు. ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నారు.

గత వారం OTT లో సినీ అభిమానులు తెగ చూసేసిన టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదీ..!

కరోనా అనంతరం ప్రజల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడానికీ ఇష్ట పడటం లేదు. ఇంట్లోనే కూర్చుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నారు. ప్రస్తుతం హిట్ చిత్రాలన్ని థియేటర్స్‌లో విడుదలైన 30రోజులకే  డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. గతవారం ఓటీటీల్లో పలు బ్లాక్ బాస్టర్ సినిమాలు స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో సినీ అభిమానులు గత వారంలో తెగ చూసేసిన టాప్ 10 చిత్రాలపై ఓ లుక్కేద్దామా..


1. The Kashmir Files (ది కశ్మీర్ ఫైల్స్):

అతి తక్కువ బడ్జెట్‌తో రూపొంది భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. 1990లో కశ్మీర్‌లో చోటు చేసుకున్న దారుణ మారణ కాండను ఈ సినిమాలో చూపించారు.   


2. Beast (బీస్ట్): 

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) హీరోగా నటించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.  విజయ్ ఈ చిత్రంలో వీర రాఘవ అనే మాజీ రా ఏజెంట్‌గా కనిపించాడు. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌‌ను ఉగ్రవాదులు హైజాక్ చేస్తే .. ఆ మాల్‌లో ఉన్న సామాన్య ప్రజల్ని ఎలా కాపాడడనేదే ఈ సినిమా కథ.  


3.Spider-Man: No Way Home (స్పైడర్ మ్యాన్: నో వే హోమ్):

‘స్పైడర్ మ్యాన్’ (Spider Man) సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఈ ప్రాంచైజీలోనే ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ (Spider-Man: No Way Home) చిత్రం వచ్చింది. టామ్ హోలాండ్, జెండియా కీలక పాత్రలు పోషించారు. జాన్ వాట్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది.   

 

4.Uncharted: (అన్‌చార్టెడ్):

యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. నేటి తరం స్పైడర్ మేన్‌గా గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు టామ్ హోలాండ్ (Tom Holland) హీరోగా నటించాడు. ఓ వీడియో గేమ్‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. సోనీ పిక్చర్ స్టూడియోస్ పతాకంపై రూబెన్ ప్లీషర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిధి కోసం సాగించే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కింది.  


5. Avatar(అవతార్):

‘టైటానిక్‌’ ను తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పండోరా గ్రహం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో ఓ కొత్త ప్రపంచాన్ని విజువల్ వండర్‌గా చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రానికీ సీక్వెల్స్‌ రాబోతున్నాయి.   

 

6. The  Batman (ది బ్యాట్‌మ్యాన్):

డీసీ కామిక్స్‌లోని అమెరికన్ సూపర్ హీరో పాత్ర బ్యాట్‌మ్యాన్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. బ్యాట్‌మ్యాన్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్( Robert Pattinson) కనిపించాడు. మాట్ రీవ్స్ దర్శకత్వం వహించాడు.  


7.The Matrix Resurrections (ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్)

యాక్షన్ ప్రియులను విశేషంగా అలరిస్తున్న సినిమా ప్రాంచైజీ  ‘ది మ్యాట్రిక్స్’ (The Matrix). ఇందులో మొదటి భాగం అదే పేరుతో 1999లో విడుదలై సంచలన విజయం సాధించింది. తర్వాత వచ్చిన ‘ది మ్యాట్రిక్స్ రీ లోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రివెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వచ్చిన మూవీ ‘ది మ్యాట్రీక్స్ రీ‌సర్కషన్స్’ (The Matrix Resurrections). లానా వచౌస్కీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కీలక పాత్ర పోషించింది. ఆమె సతి అనే పాత్రలో అభిమానులను అలరించింది.


8. Jhund (ఝుండ్)

‘ఝుండ్’ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) కీలక పాత్రలో నటించాడు. నాగపూర్‌కు చెందిన స్పోర్ట్స్ టీచర్ విజయ్ బార్సే(Vijay Barse) జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘సైరాట్’ తో జాతీయ అవార్డు‌ను పొందిన నాగరాజ్ మంజులే ‘ఝుండ్’ కు దర్శకత్వం వహించాడు. వీధి బాలలను చేరదీసి ఫుట్‌బాల్ ఆడేలా వారిని బిగ్ బీ ప్రొత్సహిస్తాడు. వారి జీవితాల్లో ఏలా మార్పులు తీసుకువచ్చాడనేదే ఈ చిత్ర కథ.   


9. టాప్ గన్ (Top Gun):

నేవీలో ఉన్నత స్థాయిలో పీట్ మిచెల్ అనే వ్యక్తి 30ఏళ్లు సేవలు అందిస్తాడు. అతడు ఎదుర్కొన్న ఒడుదొడుకులను ఈ సినిమాలో చూపిస్తారు. ఈ చిత్రంలో టామ్ క్రూయిజ్ (Tom Cruise) హీరోగా నటించాడు.  


10. కెజియఫ్: చాప్టర్-1(KGF: Chapter 1):

‘కెజియఫ్’లో రాకింగ్ స్టార్ యశ్ (yash) హీరోగా నటించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో యశ్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించాడు. 1970లో కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

Updated Date - 2022-05-19T02:04:15+05:30 IST