బాలీవుడ్ సినిమను రీమేక్ చేయనున్న Harish Shankar

ABN , First Publish Date - 2022-05-16T01:45:49+05:30 IST

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh), ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) వంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు హరీశ్ శంకర్ (Harish Shankar)

బాలీవుడ్ సినిమను రీమేక్ చేయనున్న Harish Shankar

‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh), ‘దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) వంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు హరీశ్ శంకర్ (Harish Shankar). ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా రీమేక్ చేసి పలు హిట్లు కూడా కొట్టాడు. ‘గబ్బర్ సింగ్’, ‘గద్దల కొండ గణేష్ చిత్రాలు’ అలా ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చినవే. తాజాగా అతడు ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. 


బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా నటించిన సినిమా ‘రైడ్’ (Raid). కుమార్ మంగత్ పాఠక్ (Kumar Mangat Pathak) నిర్మించాడు. లక్నోలో 1980లో చోటు చేసుకున్న యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘రైడ్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీకీ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. తెలుగు వెర్షన్‌ను కుమార్ మంగత్ పాఠకే నిర్మించనున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన విషయాలపై చర్చించడానికే హరీష్ ముంబైకీ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం అజయ్ దేవగణ్ పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’(Bhavadeeyudu Bhagat Singh) సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అనంతరం రీమేక్‌ను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ‘రైడ్’ కు రాజ్ కుమార్ గుప్తా (Raj Kumar Gupta) దర్శకత్వం వహించాడు. పనోరమా స్టూడియోస్‌తో కలసి టీ-సిరీస్ నిర్మించింది. సౌరబ్ శుక్లా, ఇలియానా కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-05-16T01:45:49+05:30 IST