ఓటీటీల్లో సినిమాల విడుదల, టికెట్ల ధరలపై నిర్మాతల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-29T22:10:40+05:30 IST

ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల్లో కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ, మంచి రివ్యూలు వచ్చి, పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే పరిస్థితి లేదు. ‘ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, విక్రమ్’ లాంటి భారీ చిత్రాలకు తప్ప.. మీడియం రేంజ్ చిత్రాలకు కలెక్షన్స్ రావడంలేదు.

ఓటీటీల్లో సినిమాల విడుదల, టికెట్ల ధరలపై నిర్మాతల కీలక నిర్ణయం

ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల్లో కంటెంట్ ఎంత బాగున్నప్పటికీ, మంచి రివ్యూలు వచ్చి, పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చే పరిస్థితి లేదు. ‘ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్, విక్రమ్’ లాంటి భారీ చిత్రాలకు తప్ప.. మీడియం రేంజ్ చిత్రాలకు కలెక్షన్స్ రావడంలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ కుదేలైన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలకు అలవాటు పడ్డ ప్రేక్షకులు తిరిగి థియేటర్స్‌కి రావడానికి ఇష్టపడడం లేదు. దీనికి తోడు విడుదలైన నెలరోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దాంతో థియేటర్స్ లోకి వచ్చిన నెలరోజుల్లో ఎలాగూ సినిమా ఓటీటీలోకి వస్తుంది కదా.. అప్పుడు చూద్దాంలే అని ప్రేక్షకులు భావించడంతో థియేటర్స్ వెలవెల బోతున్నాయి. మరొక కారణం పెరిగిన టికెట్ ధరలు. ప్రేక్షకులని మళ్లీ ఎలా  థియేటర్లకి రప్పించాలా? అని ఆలోచించకుండా.. ప్రభుత్వాలతో చర్చలు జరిపి టికెట్ల ధరలను విపరీతంగా పెంచేలా సినిమావాళ్లు చేసిన స్వయంకృతాపరాధం కూడా.. ప్రేక్షకులని థియేటర్ల వైపు నడిపించకుండా చేశాయి. ఈ క్రమంలో ఓటీటీలతో, పెరిగిన టికెట్ ధరలతో థియేటర్స్‌కు ముప్పు తప్పదని భావించిన సినీ నిర్మాతలు కొందరు తాజాగా సమావేశమై.. చర్చలు జరిపడమే కాకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో నిర్మాతలు జరిపిన చర్చల విషయానికి వస్తే..


* పెద్ద సినిమాలు విడుదలైన 8 వారాల అనంతరం ఓటిటిలో విడుదల

* చిన్న సినిమాలు విడుదలైన 6 వారాల తర్వాత ఓటిటి‌లో విడుదల

* ఈ ఓటీటీ విడుదల తీర్మానాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

* ఓటిటిల‌వల్ల ధియేటర్స్‌కు తగ్గిన ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని.. ఆడియన్స్‌ను ఆకర్షించేలా టికెట్లు మరియు తినుబండారాల ధరలు ఉండాలి.

* చిన్న సినిమా నిర్మాతలు నష్టపోకుండా.. డిస్ట్రిబ్యూషన్‌లో 80% : 20% లేదా  60% : 40% రేట్స్ ఫిక్స్ చేసుకోవాలని, క్యూబ్ చార్జెస్, థియేటర్స్ చార్జెస్ తగించాలని, హీరోలు కూడా కొంత  రెమ్యూనరేషన్ తగ్గించుకునేలా ఒప్పించాలనే నిర్ణయం.

* థియేటర్లలో స్నాక్స్ రేట్స్ కూడా తగ్గించి అమ్మేలా థియేటర్ యాజమాన్యం తప్పనిసరిగా చూడాలి.

* ఇంకా.. డిజిటల్ మాధ్యమాలలో సినిమా ప్రసారానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లుగా సమాచారం. 

Updated Date - 2022-06-29T22:10:40+05:30 IST