Tollywood producers: మాటకు కట్టుబడిలేరా?

ABN , First Publish Date - 2022-08-08T02:25:30+05:30 IST

చిత్ర పరిశ్రమకు రిపేర్లు చేసే క్రమంలో నిర్మాతలంతా కలిసి బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటకు నిర్మాతలు కట్టుబడి ఉన్నారా అంటే లేదనే మాట టాలీవుడ్‌లో వినిపిస్తోంది. పైకి బంద్‌ అని చెప్పినా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు.

Tollywood producers: మాటకు కట్టుబడిలేరా?

చిత్ర పరిశ్రమకు (TFI) రిపేర్లు చేసే క్రమంలో నిర్మాతలంతా కలిసి బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాటకు నిర్మాతలు కట్టుబడి ఉన్నారా అంటే లేదనే మాట టాలీవుడ్‌లో వినిపిస్తోంది. పైకి బంద్‌ అని చెప్పినా ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు. (Film producers) షూటింగ్‌ జరిగేది తెలుగు సినిమా కాదని, తమిళ సినిమా అని బండి నడిపించేస్తున్నారు. ఇలా ‘వారసుడు’, సార్‌’ చిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. బందుకు పిలుపునిచ్చి మీ షూటింగ్‌లు జరుపుకొంటునప్పుడు మేమెందుకు చిత్రీకరణ నిలిపేసి కూర్చోవాలి’ అంటూ కొందరు నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. (Shootings bund)


అందుకే సోమవారం నుంచి యథావిధిగా షూటింగ్‌లు జరుగుతాయనే మాట గట్టిగానే వినిపిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger nageswararao)షూటింగ్‌ సోమవారం మొదలుకాబోతుందని తెలిసింది. ఇదే కాదు.. మరో ఐదారు చిత్రాలు షెడ్యూల్‌కి ప్లాన్‌ చేస్తున్నారట. పెద్దలంతా కలిసి ఓ నిర్ణయం తీసుకున్నా.. ఇదేం పద్దతని ప్రశ్నిస్తున్నారు. ఎటూ సమాధానం చెప్పలేని చిన్న నిర్మాతలు నష్టాలను భరించలేక షూటింగ్‌లు చేసుకుంటున్నారు. దీంతో షూటింగ్‌లు బంద్‌ అనే నిర్ణయం.. ప్రకటనకే పరిమితమైనట్లుంది. మరోవైపు ఛాంబర్‌, నిర్మాతల మండలి, గిల్డ్‌ రోజుకో సమావేశం నిర్వహిస్తూనే ఉంది. ఈ చర్చలు సఫలమై ఈ నెల 15 తేదీకి ఓ కొలిక్కి వస్తాయని, ఆ తర్వాత రెండు రోజులకు షూటింగ్‌ల బంద్‌ తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. (Film chamber)


Updated Date - 2022-08-08T02:25:30+05:30 IST