Tollywood: జూన్ మొత్తం సందడే సందడి..

ABN , First Publish Date - 2022-06-07T14:40:46+05:30 IST

మన టాలీవుడ్ (Tollywood) బాక్సాఫీస్ వద్ద ఈనెల (జూన్) మొత్తం బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొనబోతుంది. ప్రతీవారం మూడు నాలుగు సినిమాలతో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు సందడి చేయనున్నారు.

Tollywood: జూన్ మొత్తం సందడే సందడి..

మన టాలీవుడ్ (Tollywood) బాక్సాఫీస్ వద్ద ఈనెల (జూన్) మొత్తం బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొనబోతుంది. ప్రతీవారం మూడు నాలుగు సినిమాలతో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు సందడి చేయనున్నారు. కరోనా కారణంగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు తెరకెక్కి కూడా పెద్ద సినిమాలు విడుదల కారణంగా నిలిచిపోయాయి. ఇప్పుడు దాదాపు తెలుగులో రూపొందిన పెద్ద సినిమాలన్నీ రిలీజైపోయాయి. దాంతో చాలా సినిమాలు ఈ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


ఇప్పటికే జూన్ ఫస్ట్ వీక్‌లో 'మేజర్' (Major) మూవీతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ (Kamal Haasan) 'విక్రమ్' (Vikram)..'మయూరాక్షి'.. 'సమ్రాట్ పృథ్వీరాజ్' ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇక వచ్చే వారం ఈ లిస్ట్ ఇంకాస్త పెరగనుంది. నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన 'అంటే సుందరానికీ' Ante Sundaraniki).. 'సురాపానం'..' జరిగిన కథ' లాంటి స్ర్టెయిట్ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు '777 చార్లీ'.. 'జురాసిక్ వరల్డ్ డొమీనియన్' తో పాటు ఇంకొన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.


ఇక జూన్ 19న సత్య దేవ్ (Sathya Dev) నటించిన 'గాడ్సే'... రానా (Rana) - సాయి పల్లవి (Sai Pallavi) ల 'విరాట పర్వం' (Virata Parvam)..' కె-3' ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అలాగే, జూన్ చివరి వారంలో ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జూన్ 23న ఆర్జీవి 'కొండా' ..24న 'సమ్మతమే'.. '7 డేస్ ..6 నైట్స్'..'ఒక పథకం ప్రకారం'.. 'గ్యాంగ్ స్టర్ గంగ రాజు'.. 'టెన్త్ క్లాస్ డైరీస్'.. 'హుషారు'.. 'సదా నన్ను నడిపే' ..'సాప్ట్ వేర్ బ్లూస్' చిత్రాలు థియేటర్లోకి రాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో ఎన్ని హిట్ టాక్ తెచ్చుకొని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడతాయో చూడాలి. 

Updated Date - 2022-06-07T14:40:46+05:30 IST