Tollywood: ముదిరిన వివాదం..28 సినిమాల షూటింగ్ బంద్

ABN , First Publish Date - 2022-06-23T15:54:07+05:30 IST

తెలుగు చలన చిత్ర (Tollywod) వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ (Film Federation)కు మధ్య వివాదం ముదురుతోంది. సినీ కార్మికులు తమ వేతనాలు పెంచమని ఎప్పటినుంచో నిర్మాతలను కోరుతున్నారు.

Tollywood: ముదిరిన వివాదం..28 సినిమాల షూటింగ్ బంద్

తెలుగు చలన చిత్ర (Tollywod) వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ (Film Federation)కు మధ్య వివాదం ముదురుతోంది. సినీ కార్మికులు తమ వేతనాలు పెంచమని ఎప్పటినుంచో నిర్మాతలను కోరుతున్నారు. కానీ, వారి సమస్య పరిష్కారం కాకపోవడంతో జూన్ 22 నుంచి షూటింగులు నిలిపివేసి ఆందోళనకు దిగారు. సినీ కార్మికులంతా కలిసి.. ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడించారు. తమ డిమాండ్‌ను వెంటనే నెరవేర్చమని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. కార్మికుల వేతనాలు పెంచడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.


నేటినుంచి కార్మికులంతా యధావిధిగా షూటింగులకు హాజరవ్వాలని సూచించారు. అయినా కూడా సినీ కార్మీకులెవరూ ఈరోజు కూడా షూటింగులలో పాల్గొనలేదు. తాజా పరిస్థితి చూస్తుంటే తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి తెలుగు ఫిలిం ఫెడరేషన్‌కు మధ్య ఈ వివాదం బాగానే ముదిరినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో జరుగుతున్న 28 సినిమాల షూటింగ్ నిలిచిపోయిందని సమాచారం.


ఈ రోజు నుంచి ఎదావిధిగా షూటింగ్స్ లో పాల్గొనాలి.. అని తెలుగు పిలిం ఛాంబర్ కోరింది. లేని పక్షంలో అరు నెలల పాటు షూటింగ్స్ నిలిపి వేస్తామని నిర్మాతల మండలి హెచ్చరించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఎవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దు.. అని కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ కోరింది. అయితే, ఎట్టిపరిస్థితుల్లో వేతనాలు పెంచేంతవరకు షూటింగులకు హాజరుకాము.. అని ఫెడరేషన్ సభ్యులు పట్టుపట్టారు. ప్రస్తుతమున్న రెమ్యునరేషన్ కన్నా 45 శాతం ఎక్కువ ఇవ్వాలి.. అని డిమాండ్ చేస్తున్నారు. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టాపోయేది నిర్మాతలే అని ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా సిని పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ఈ విషయంలో ఓ స్పష్ఠత రానుందని తెలుస్తోంది. 

Updated Date - 2022-06-23T15:54:07+05:30 IST