August లో అయినా హిట్స్ వస్తాయా?

ABN , First Publish Date - 2022-08-01T22:27:16+05:30 IST

టాలీవుడ్ హిట్ ముఖం చూసి చాలా రోజులే అయింది. వారానికి నాలుగైదు సినిమాలు వస్తు్న్నా అందులో ఒక్కటి కూడా హిట్టు గట్టెక్కడం లేదు. కనీసం యావరేజ్ దగ్గర కూడా ఆగడం లేదు. అన్నీ నిర్మాతలు, బయ్యర్లని నిలువునా ముంచే డిజాస్టర్లే. థియేటర్స్ దగ్గర జనం లేక షోస్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి.

August లో అయినా హిట్స్ వస్తాయా?

టాలీవుడ్ హిట్ ముఖం చూసి చాలా రోజులే అయింది. వారానికి నాలుగైదు సినిమాలు వస్తు్న్నా అందులో ఒక్కటి కూడా హిట్టు గట్టెక్కడం లేదు. కనీసం యావరేజ్ దగ్గర కూడా ఆగడం లేదు. అన్నీ నిర్మాతలు, బయ్యర్లని  నిలువునా ముంచే డిజాస్టర్లే. థియేటర్స్ దగ్గర జనం లేక షోస్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఏపీలోని 400 థియేటర్స్ మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. రానున్న రోజుల్లో థియేటర్స్ కనుమరుగవడం ఖాయం అనిపిస్తోంది. ఎన్ని ప్లాపులొచ్చినా.. కొత్త సినిమా విడుదలయ్యేప్పుడల్లా కొత్త ఆశలు చిగురిస్తూంటాయి. ఇప్పుడు టాలీవుడ్ అదే పరిస్థితుల్లో ఉంది. జూలై నెల సినిమాల పరంగా.. ఘోరఫలితం చవిచూసింది. ఇప్పుడు తెలుగు తెర.. ఆగస్ట్ పై తన ఆశలన్నీ పెట్టుకుంది. 


ఆగస్ట్ నెల్లో చెప్పుకోదగ్గ స్థాయి సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ నెల 5న నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyanram) ‘బింబిసార’ (Bimbisara), మలయాళ యంగ్ స్టార్ దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) ‘సీతారామం (Sitaramam)’ విడుదల కాబోతున్నాయి. ఒకటి ప్రేమకథ, మరొకటి సోషియో ఫాంటసీ కథ. ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ వర్గాల్లో మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. టీజర్, సింగిల్స్, ట్రైలర్ తో విడుదలకు ముందే ‘సీతారామం’ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. రష్మి్కా మందణ్ణ (Rashmika Mandanna), మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) గ్లామర్ అపీరెన్స్ ప్లస్ కాబోతోంది. ఇక బింబిసార టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందుతోంది. ఈ సినిమా గ్యారెంటీ హిట్ అని యన్టీఆర్ భరోసా కల్పించాడు. ఈ రెండు సినిమాలతో ఆగస్ట్ నెల ఆశావహంగా మొదలు కాబోతోంది.


ఇక ఈ నెల 12న రెండు సినిమాలొస్తున్నాయి. ఒకటి నితిన్ (Nithin) పొలిటికల్ థ్రిల్లర్ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam). రెండోది నిఖిల్ (Nikhil) మిస్టిక్ థ్రిల్లర్ ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఈ రెండు సినిమాలపై కూడా మంచి క్రేజ్ నెలకొంది.  ఒకటి మాస్ యాక్షన్ థ్రిల్లర్, మరొకటి క్లాస్ థ్రిల్లర్. ఈ ఇద్దరు హీరోలకు యూత్‌లో మంచి క్రేజుంది. ఈ రెండూ ట్రైలర్స్ తో మంచి స్పందన దక్కించుకున్నాయి. అలా..ఈ రెండు సినిమాలపై కూడా పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. ఇక ఈ నెల్లో విడుదలయ్యే మరో మోస్ట్ ఎవైటెడ్ మూవీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ‘లైగర్’ (Liger). బాక్సింగ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఆగస్ట్ 25న చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. విజయ్‌కున్న క్రేజ్ ఈ సినిమాకి ప్లస్ కానుంది. దీనికి తోడు మైక్ టైసన్ పాత్రకూడా సినిమాకి హైలైట్ కానుంది. బిజినెస్ పరంగా పూరీ పూర్తి సంతృప్తిగా ఉన్నాడని టాక్. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా. కలెక్షన్స్ పరంగా దుమ్మురేపడం ఖాయం.  వీటితో పాటు మరో ఆరేడు సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్టయినా వరుస ప్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్‌కు కాస్తలో కాస్త ఊరటదక్కినట్టే. చూద్దాం.. ఆగస్ట్ లో ఏ సినిమాది పై చేయి అవుతుందో. 

Updated Date - 2022-08-01T22:27:16+05:30 IST