Tollywood heros: మీకు అర్థమవుతోందా?

ABN , First Publish Date - 2022-09-05T20:46:10+05:30 IST

కొన్ని నెలలుగా చూస్తే థియేటర్లలో సినిమాల సంఖ్య బాగానే కనిపిస్తోంది. వాటిలో కంటెంట్‌ ఉన్నవి మాత్రమే బాక్సాఫీస్‌ దగ్గర నిలబడగలుగుతున్నాయి. కంటెంట్‌ లేని చిత్రాలు ఒక్కరోజు కూడా థియేటర్‌లో నిలబడిన దాఖలాలు లేదు. కనీస వసూళ్లు రాబట్టలేకపోయాయి.

Tollywood heros: మీకు అర్థమవుతోందా?

కొన్ని నెలలుగా చూస్తే థియేటర్లలో సినిమాల సంఖ్య బాగానే కనిపిస్తోంది. వాటిలో కంటెంట్‌ ఉన్నవి మాత్రమే బాక్సాఫీస్‌ దగ్గర నిలబడగలుగుతున్నాయి. కంటెంట్‌ లేని చిత్రాలు ఒక్కరోజు కూడా థియేటర్‌లో నిలబడిన దాఖలాలు లేదు. కనీస వసూళ్లు రాబట్టలేకపోయాయి. అది స్టార్‌ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా ప్రేక్షకుల తీర్పు ఒకేలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. స్టార్‌ హీరోల పాత సినిమాలను వాళ్ళ పుట్టినరోజుకో లేదా, ఆ సినిమా ఇన్నేళ్లు పూర్తి చేసింది అనే సందర్భంగానో దానిని డిజిటలైజ్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఇటీవల మహేష్‌ బాబు ‘పోకిరి’(Pokiri), పవన్‌ కళ్యాణ్‌ (Pawan kalyan) ‘జల్సా’ చిత్రాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇకముందు కూడా ఇలా పాత చిత్రాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 


అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటి యువత ఈ రెండు సినిమాలను విపరీతమైన క్రేజ్‌తో చూశారు. అంటే దీనర్థం ఈ సినిమాల్లో ఏదో వుంది, ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్‌ ఉంది. అందుకనే ఇన్నేళ్ల తరువాత కూడా ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించగలిగాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాలే ఓటీటీల్లో ఉన్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు కూడా. అయినప్పటికీ మళ్లీ థియేటర్స్‌లో చూశారంటే.. ఆ సినిమాల్లో తమ అభిమాన హీరోలు ప్రేక్షకుడి అభిరుచి తగ్గట్లు చేసి ఉండొచ్చు. అందుకే ఎగబడి మరీ చూశారు. అదే స్టార్‌ హీరోలు నటించిన లేటెస్ట్‌ సినిమాలు ఎందుకు అంతగా ఆదరించలేకపోతున్నారు. ఇప్పటి సినిమాల్లో ప్రేక్షకులు, అభిమానులు కోరుకునే అంశాలనే ఇవ్వలేకపోతున్నారేమో అనిపిస్తోంది. అప్పటి సినిమాల్లో వినోదం బాగా ఉండేది, ఇప్పుడు అదే కరువైంది అన్నమాట. స్టార్‌ ఇమేజ్‌ పెరిగినకొద్దీ హీరోలు కొంచెం అభద్రతా భావానికి లోనై, దర్శకుడికి ఫ్రీడమ్‌ ఇవ్వకుండా వారే కథలో ఇన్‌వాల్వ్‌ అయిపోయి ఏవేవో చేస్తున్నారన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. గత చిత్రాలను ఇంత ఎగ్జైట్‌మెంట్‌తో చూశారంటే... అందులో ఈ హీరోల నటన ఒక్కటే కాదు, కథలో కొత్తదనం, వినోదం, పాటలు రక్తికట్టించేలా ఉండేవి. అందుకనే అప్పట్లో అవి ట్రెండ్‌ సృష్టించాయి. ఇప్పుడు కూడా అదే చిత్రాలను ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అంటే అప్పటి కథల్లో ఏముంది? ఇప్పుడు ఏం మిస్‌ అయింది అన్నది హీరోలు, మేకర్స్‌ గుర్తించడం లేదు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు లాంటి హీరోలో కాకుండా, మిగతా హీరోలు కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. కాంబినేషన్‌ కన్నా కంటెంట్‌ ముఖ్యం అన్నది గుర్తించినప్పుడే పరిశ్రమ బాగుపడుతుందని తెలుసుకోవాలి. 


Updated Date - 2022-09-05T20:46:10+05:30 IST