Tollywood: మన హీరోలు తగ్గారు సర్..

ABN , First Publish Date - 2022-07-28T03:42:18+05:30 IST

ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా బడ్జెట్‌లో 70 శాతం కాస్ట్ రెమ్యునరేషన్‌కే పోతుంది. మిగిలిన దాంట్లో సినిమాని షూట్ చేస్తారు. టాలీవుడ్‌ (Tollywood)లో ఫిల్మ్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ పెరగడానికి హీరోల..

Tollywood: మన హీరోలు తగ్గారు సర్..

ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా బడ్జెట్‌లో 70 శాతం కాస్ట్ రెమ్యునరేషన్‌కే పోతుంది. మిగిలిన దాంట్లో సినిమాని షూట్ చేస్తారు. టాలీవుడ్‌ (Tollywood)లో ఫిల్మ్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ పెరగడానికి హీరోల రెమ్యునరేషన్ అతి పెద్ద కారణంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాలు అవడం, ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి రావడంతో మన హీరోలు ఆకాశాన్ని తాకే రెమ్యునరేషన్ అడుగుతున్నారు. హీరోలు అడిగినంతా ఇచ్చి.. సినిమా ఖర్చుని ప్రొడ్యూసర్స్ అమాంతం పెంచేస్తున్నారు. ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటైన ఈ సమస్యని సాల్వ్ చేయడానికి రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun) ముందుకి వచ్చారు. మన హీరోలు తగ్గారు. 


స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఈ హీరోలతో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితిని వివరించడంతో... కాస్ట్ ఆఫ్ మేకింగ్‌ని తగ్గించడానికి మన హీరోలు ముందుకొచ్చి... తమ రెమ్యునరేషన్‌లో కోత వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చిరు కూడా రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గుతాను అనే హింట్ ఇచ్చాడు. మిగిలిన హీరోలు కూడా ముందుకొచ్చి, రెమ్యునరేషన్ విషయంలో కాస్త పట్టు వదిలితే... ప్రొడక్షన్ కాస్ట్‌లో భారీ తేడా కనిపించే అవకాశం ఉంది. హీరోల రెమ్యునరేషన్ తగ్గితే, మేకింగ్ కాస్ట్ తగ్గుతుంది, దీని వల్ల సినిమాకి అయ్యే ఖర్చు తగ్గుతుంది... ఫలితంగా థియేట్రికల్ బిజినెస్ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. అప్పుడు ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా.. కొన్న వాళ్లకి వచ్చే నష్టాల స్థాయి తగ్గుతుంది. 


అయితే హీరోల రెమ్యునరేషన్‌తో పాటు గిల్డ్ దృష్టి పెట్టాల్సిన మరో విషయం ఓటీటీల రిలీజ్ డేట్స్. థియేటర్ రన్‌కి ఓటీటీ (OTT) రిలీజ్ డేట్‌కి కనీసం రెండున్నర నెలల గ్యాప్ ఉంటే అప్పుడు ఆడియన్స్ థియేటర్‌కి వస్తారు.. లేదంటే ఎన్ని చేసినా ఇంట్లో కూర్చొనే సినిమా చూస్తారు.

Updated Date - 2022-07-28T03:42:18+05:30 IST