Tollywood: ట్రెండ్ ఫాలో అవుతున్న స్టార్స్

ABN , First Publish Date - 2022-05-28T03:23:25+05:30 IST

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో దర్శకులు, స్టార్ హీరోలు ఎప్పుడూ కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. ట్రెండ్‌కు అనుగుణంగా అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు టాలీవుడ్‌లో దర్శక నిర్మాతలు

Tollywood: ట్రెండ్ ఫాలో అవుతున్న స్టార్స్

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో దర్శకులు, స్టార్ హీరోలు  ఎప్పుడూ కూడా ఒక ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు. ట్రెండ్‌కు అనుగుణంగా అన్ని సినిమాలు తీస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు టాలీవుడ్‌లో దర్శక నిర్మాతలు తాము తీసే సినిమాలకు కాస్త పొలిటికల్ టచ్ ఇవ్వాలని భావిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరోలు.


మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో నటించారు. ఇక రాబోయే చిత్రం ‘గాడ్ ఫాదర్’ (Godfather) కూడా అలాంటి కోవకు చెందినదే అన్న విషయం తెలిసిందే. మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌లో వస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో జన జాగృతి పార్టీ లీడర్‌గా కనిపించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఏకంగా రాజకీయాలను శాసించే టార్చ్ బేరర్‌గా చిరంజీవి కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నయనతార (Nayanathara) కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా పొలిటికల్ జానర్‌లోనే తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పార్టీ లీడర్‌గా కనిపించబోతున్నాడట. 


జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గతంలో రాజకీయ నేపథ్యం ఉన్న చాలా సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పుడు కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని తెలుస్తోంది. ఇంకా యంగ్ హీరో నితిన్ (Nithiin) ‘మాచర్ల నియోజకవర్గం’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘భవదీయుడు భగత్ సింగ్’, వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలు కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉండబోతున్నాయని తెలుస్తోంది.

Updated Date - 2022-05-28T03:23:25+05:30 IST