Tollywood Heroes: దేశం నలుమూలలా తెలుగోళ్లు...

Twitter IconWatsapp IconFacebook Icon

Tollywood Heroes: దేశం నలుమూలలా తెలుగోళ్లు...

ప్రస్తుతం ఇండియా మొత్తం తెలుగోళ్ళ హవా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు హీరోల హవా నడుస్తోంది. మన హీరోలు, సరిహద్దులు తెంచుకొని ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ప్రస్తుతం కార్తికేయ 2 (Karthikeya 2) టీం వాళ్ల సినిమాని ప్రమోట్ చేస్తూ, ఇండియా మొత్తం తిరుగుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), పూరి జగన్నాధ్ (Puri Jagannath), ఛార్మి (Charmi)లు కూడా లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం నార్త్ ఇండియా అంతా చాలా అగ్రెసివ్ గా తిరుగుతున్నారు. ఆల్మోస్ట్ హిందీ సినిమానే తీసాము మీరు చూడండి అనే రేంజులో లైగర్ (Liger) సినిమాని నార్త్ లో ప్రమోట్ చేస్తున్నారు. త్వరలో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా బింబిసార (Bimbisara) సినిమాని హిందీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 

తెలుగులో డబుల్ బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ హిందీ మార్కెట్ కూడా సొంతం చేసుకునేలా హ్యూజ్ ప్రమోషన్స్ చేయడానికి నందమూరి హీరో ప్లాన్ చేస్తున్నాడు. అవసరం అయితే నార్త్ ప్రమోషన్స్ లో తమ్ముడు తారక్ ని కూడా రంగంలో దించడానికి కళ్యాణ్ రామ్ సిద్దమవుతున్నాడు. నిజానికి ఈ ట్రెండ్ ని రాజమౌళి బాహుబలి సినిమాతో మొదలుపెట్టి, ఆర్ఆర్ఆర్ సినిమాతో పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లాడు. ప్రభాస్, ఎన్టీఆర్ చరణ్ లు తెలుగు రాష్ట్రాల్లో కన్నా నార్త్ లోనే ఎక్కువ తిరిగి, అక్కడ మన సినిమాని ప్రమోట్ చేశారు. బాలీవుడ్ వాళ్ళు కూడా వెళ్ళని చోటుకి వెళ్లి ఆడియన్స్ ని మీట్ అయ్యారు, ప్రెస్ మీట్స్ కూడా పెట్టారు. 

ఆ తర్వాత అల్లు అర్జున్ నార్త్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు కానీ అక్కడ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. పుష్ప 2 విషయంలో ఆ లోటు కనిపించకుండా నార్త్ లో సుడిగాలి పర్యటనకి ఐకాన్ స్టార్ ప్రిపేర్ అవుతున్నాడు. సో ప్రభాస్ తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు పీక్ స్టేజ్ కి వెళ్లి... స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ నార్త్ టు సౌత్ అన్ని ఏరియస్ కవర్ చేస్తూ ప్రొమోషన్స్ చేస్తున్నారు. అందుకే దేశం నలుమూలలా తెలుగోళ్ళ హవా కొనసాగుతుంది అని చెప్పాము. 

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.