Bollywood: సల్మాన్ ఖాన్, రణ్వీర్‌లతో.. తెలుగు హీరో పోటీ!

ABN , First Publish Date - 2022-09-17T18:41:47+05:30 IST

మీరు విన్నది కరెక్టే! హిందీలో అగ్ర నటులు అయినటువంటి సల్మాన్ ఖాన్ (Salman Khan), రణ్వీర్ సింగ్ (Ranveer Singh)లతో.. టాలీవుడ్ హీరో పోటీపడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో..

Bollywood: సల్మాన్ ఖాన్, రణ్వీర్‌లతో.. తెలుగు హీరో పోటీ!

మీరు విన్నది కరెక్టే! హిందీలో అగ్ర నటులు అయినటువంటి సల్మాన్ ఖాన్ (Salman Khan), రణ్వీర్ సింగ్ (Ranveer Singh)లతో.. టాలీవుడ్ హీరో పోటీపడబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరనుకుంటున్నారు?.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన తెలుగు సినిమా ‘ఛత్రపతి’ (Chatrapathi) రీమేక్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీ‌లోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి వివి వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్‌లో విడుదల కావాల్సి వుంది. కానీ ఈ సినిమాకి గ్రాఫిక్ పని చాలా ఉండటంతో.. విడుదల విషయంలో బాగా ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల ఈ సినిమా విడుదల తేదీ డిసెంబర్‌లో ఉండొచ్చని అనుకుంటున్నారు. 


అయితే, డిసెంబర్ 23న రణ్వీర్ సింగ్ సినిమా ‘సర్కస్’ (Circus) విడుదలవుతుండగా, సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమా డిసెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కూడా డిసెంబర్‌లోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారనేలా వార్తలు వస్తుండటంతో.. ఈ ఇద్దరు అగ్ర కథానాయకులతో పోటీ‌గా బెల్లంకొండ హీరో బరిలోకి దిగడం కాయం అని తెలుస్తోంది. అయితే ఈ పోటీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాని దించడం.. ఒక స్ట్రాటజీ (Strategy) అని కూడా చెప్పుకుంటున్నారు. ఇలా పెద్ద సినిమాలతో విడుదల అయితేనే కదా.. బెల్లంకొండ హీరో సినిమాని కూడా ప్రేక్షకులు గుర్తిస్తారని.. అదే టైమ్‌లో విడుదల చేద్దాం అని ఆ చిత్ర నిర్మాతలు అనుకుంటున్నారని తెలిసింది. తెలుగు ‘ఛత్రపతి’ ప్రభాస్‌ని స్టార్ హీరోని చేసింది. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించాడు. మరి అదే సినిమాని బెల్లంకొండ హిందీలో వినాయక్ దర్శకత్వంలో చేస్తున్నాడు.. అతన్ని ఈ సినిమా ఎక్కడికి తీసుకెళుతుందో వేచి చూడాలి.



Updated Date - 2022-09-17T18:41:47+05:30 IST