Indira Devi: ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలి - చిరంజీవి

ABN , First Publish Date - 2022-09-28T15:46:45+05:30 IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మాతృ వియోగం కలిగిన విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ భార్య ఇందిరాదేవి బుధవారం (సెప్టెంబర్ 28న) తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆమెకి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో..

Indira Devi: ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలి - చిరంజీవి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మాతృ వియోగం కలిగిన విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ కృష్ణ భార్య ఇందిరాదేవి బుధవారం (సెప్టెంబర్ 28న) తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆమెకి గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స తీసుకుంటూ ఈరోజు కన్నుమూశారు. ఇందిరాదేవి మృతితో ఘట్టమనేని కుటుంబంతో పాటు.. తెలుగు చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో రమేశ్ బాబు మృతితో బాధలో ఉన్న ఈ కుటుంబం.. ఇందిరా మరణంతో మరింత కృంగిపోయింది. ఈతరుణంలో.. టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణకి, మహేశ్ బాబుకి సానుభూతిని తెలియజేశారు.


‘‘శ్రీమతి ఇందిరాదేవిగారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృ దేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ.. సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్ బాబుకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’’

- చిరంజీవి


‘‘ఘట్టమనేని కృష్ణగారి సతీమణి, ఘట్టమనేని మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణం బాధాకరం. ఇందిరాదేవి గారు లేకపోవడం కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఇందిరాదేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’

- నందమూరి బాలకృష్ణ


‘‘సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి శ్రీమతి ఇందిరా దేవి గారి మృతి చాలా బాధాకరం.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ... #కృష్ణ గారికి, @urstrulyMahesh గారికి వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ - విజయశాంతి


‘‘ప్రముఖ నటులు శ్రీ కృష్ణగారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవిగారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించింది. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని  ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణగారు, శ్రీ మహేష్ బాబుగారు త్వరగా కోలుకొనే, మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నాను’’

-పవన్ కల్యాణ్


‘‘ఇందిరమ్మ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కృష్ణ గారు, మహేశ్ బాబు ఇతర కుటుంబ సభ్యులు అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ 

- బాబీ


‘‘మహేష్ బాబు గారి తల్లి ఇందిరాదేవి గారు ఆకస్మిక మరణం చాలా దురదృష్టకరం. కృష్ణ గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’

-యూవీ క్రియేషన్స్























Updated Date - 2022-09-28T15:46:45+05:30 IST