విలన్‌ని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్..?

ABN , First Publish Date - 2022-04-05T01:15:19+05:30 IST

మోడల్‌గా కెరీర్ ఆరంభించి అనంతరం హీరోయిన్‌గా మారిన అందాల భామ విమలా రామన్.

విలన్‌ని పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్..?

మోడల్‌గా కెరీర్ ఆరంభించి అనంతరం హీరోయిన్‌గా మారిన అందాల భామ విమలా రామన్. మలయాళం ఇండస్ట్రీలో తొలుత నటిగా ప్రయాణాన్ని ఆరంభించింది. ‘గాయం-2’, ‘చట్టం’, ‘ఎవరైనా.. ఎపుడైనా’ తదితర చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. విమలా రామన్‌కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 


వినయ్ రాయ్ అనే తమిళ నటుడిని విమలా రామన్ ప్రేమిస్తోంది. గత కొన్నేళ్లుగా అతడితో డేటింగ్ చేస్తుంది. ఈ లవ్‌బర్డ్స్ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వినయ్ రాయ్, విమలా రామన్ పలు మార్లు జంటగా మీడియా కంట కూడా పడ్డారు. మాల్దీవుల్లో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఈ లవ్ బర్డ్స్ సోషల్ మీడియాలో అనేకసార్లు వేర్వేరుగా అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే వివాహమాడనున్నారని ఈ జంటతో సన్నిహితంగా మెలిగే వారు తెలుపుతున్నారు. పెళ్లి జరిగే తేదీని అధికారికంగా ప్రకటిస్తారట. అయితే.. ఈ జంట పెళ్లి చేసుకుంటరా లేదా అనేది మాత్రం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. వినయ్ రాయ్ ‘డిటెక్టివ్’, ‘చంద్రకళ’, ‘వరుణ్ డాక్టర్’ తదితర సినిమాల్లో విలన్‌గా నటించాడు.



Updated Date - 2022-04-05T01:15:19+05:30 IST