Shahid Kapoor Jersey సినిమాను చూసిన తర్వాత నాని రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-22T18:56:04+05:30 IST

పలు వాయిదాల తర్వాత షాహిద్ కపూర్ క్రికెట్ డ్రామా 'జెర్సీ' ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది....

Shahid Kapoor Jersey సినిమాను చూసిన తర్వాత నాని రియాక్షన్ ఏంటంటే..

పలు వాయిదాల తర్వాత షాహిద్ కపూర్ క్రికెట్ డ్రామా 'జెర్సీ' ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది. ‘కబీర్ సింగ్’ తర్వాత ఈ యువ నటుడు చేసిన సినిమా కావడంతో బాలీవుడ్ జనాలు ఎంతో ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూశారు. టాలీవుడ్ యువ నటుడు నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకి ఇది హిందీ రీమేక్. తెలుగు సినిమాకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే ఈ మూవీ డైరెక్టర్. తాజాగా విడుదలైన షాహిద్ ‘జెర్సీ’ చూసిన నాని ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో స్పందించాడు.


నాని చేసిన ట్వీట్‌లో.. ‘జెర్సీని చూశాను. గౌతమ్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటనతో మనసులను కొల్లగొట్టారు. పంకజ్ కపూర్ సర్, రోనిత్ కూడా ఇరగదీశారు. నిజమైన సినిమా అంటే ఇదే’ అంటూ రాసుకొచ్చాడు.


నానియే కాకుండా ఎంతోమంది నెటిజన్లు సైతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. మూవీ సూపర్‌గా ఉందనీ, షాహిద్ కపూర్ నటన అద్భుతమని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. గౌతమ్ డైరెక్షన్‌‌ని మరోసారి ఇరగదీశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి మన టాలీవుడ్ మూవీ అర్జున్ రెడ్డి రీమేక్‌గా కబీర్ సింగ్‌తో, తాజాగా జెర్సీతో షాహిద్ కపూర్ వరుస హిట్లు కొట్టడం గమనార్హం.







Updated Date - 2022-04-22T18:56:04+05:30 IST