ఉదయనిధికి Boney Kapoor కాస్ట్లీ గిఫ్ట్

ABN , First Publish Date - 2022-07-12T18:32:55+05:30 IST

ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) హీరోగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor) సమర్పణలో జీ స్టూడియోస్‌, బేవ్యూ ప్రొజెక్టు, రోమియో పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ‘నెంజుక్కు నీది’ (Nenjuku Needhi)

ఉదయనిధికి  Boney Kapoor కాస్ట్లీ గిఫ్ట్

ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) హీరోగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor) సమర్పణలో జీ స్టూడియోస్‌, బేవ్యూ ప్రొజెక్టు, రోమియో పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ‘నెంజుక్కు నీది’ (Nenjuku Needhi) చిత్రం విడుదలై 50 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో చిత్ర యూనిట్‌ 50 డేస్‌ ఫంక్షన్‌ను నిర్వహించింది. ఇందులో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు పంపిణీదారులకు నిర్మాత బోనీకపూర్‌, హీరో ఉదయనిధి స్టాలిన్‌ 50 డేస్‌ షీల్డ్స్‌ను బహూకరించారు. హీరో ఉదయనిధి స్టాలిన్‌కు బోనీ కపూర్‌ బంగారు గొలుసును బహూకరించారు. 


ఈ సందర్భంగా బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా బ్యానరులో మంచి కథలతో కూడిన చిత్రాలను నిర్మించాలన్నదే మా సంకల్పం. తమిళంలో వరుస ప్రాజెక్టులు చేయాలని భావిస్తున్నాను. మరో మూడు నాలుగు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ఉదయనిధితో కలిసి మరో చిత్రం చేయాలని భావిస్తున్నాను. ఆయన సినీ రాజకీయ ప్రయాణం బాగుండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. 


హీరో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘సొంత బ్యానర్‌లో అరుణ్‌రాజా కామరాజ్‌తో కలిసి నటించనున్నాను. ఆ తర్వాత బోనీ కపూర్‌ బ్యానరులో నటిస్తాను. ఈ చిత్రం విజయం వెనుక దర్శకుడి కష్టం దాగివుంది. నటీనటులు, టెక్నీషియన్లు ఎంతగానో శ్రమించారు. మంచి చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు తాన్య రవిచంద్రన్‌ (Tanya Ravichandran), శివానీ రాజశేఖర్‌ (Shivani Rajasekhar), నటుడు ఆరి అర్జునన్‌, సంగీత దర్శకుడు దిబు, ఇతర టెక్నీషియన్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-12T18:32:55+05:30 IST